Next Page 

రాగహేల పేజి 1

   
                                                               రాగహేల
        
                                                                      ---వాసిరెడ్డి సీతాదేవి
    

                                    

   

 

   "నమస్తే అంకుల్!" "హలో మహతి! రా రా" ప్రొఫెసర్ పరశురాం రివాలింగ్ చైర్లో గిర్రున తిరిగిమహతిని ఆప్యాయంగా ఆహ్వానించాడు. "నీ పనికి అంతరాయం కలిగిస్తున్నానాఅంకుల్!" అంటూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. "అబ్బెబ్బే పనికిఅంతరాయం ఏమిటి నువ్వు వస్తే? అసలు ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నానో చెప్పగలవా?" అన్నాడు పరశురాం పైపు నోట్లో పెట్టుకొంటూ. "ఇప్పుడా? అంటే ఈ క్షణంలో నేను వచ్చి కూర్చున్నతర్వాత?" మహతి ఆటలు పట్టుస్తున్నట్లుగా అంది. "కాదు....నువ్వు వచ్చేసరికి" "ఆంటీ గురించి...." అంది మహతి టీజింగ్ గా. పరశురాం కలగాపులగంగా నెరసిన గుబురు మీసాల క్రిందనుంచి సన్నటిహాస్యరేఖ తొంగిచూసింది. "యూ నాటీ గర్ల్! నీ గురించే ఆలోచిస్తున్నాను". "నా గురించా? ఏ విషయంలో అంకుల్?" "అదేనమ్మా ఇన్ని రోజుల్నుంచీఏమైపోయావ్? మీ ఆంటీకూడా మహతి రావడంలేదేమండీ అంటూ నా బుర్ర తినేస్తుందనుకో" "నేను నమ్మనుఅంకుల్" గాంభీర్యాన్నినటిస్తూ అంది మహతి. పైపు పొగను పెదవుల సందులనుంచి కొద్దికొద్దిగా వదులుతూప్రశ్నార్ధకంగా చూశాడు పరశురాం మహతిముఖంలోకి. "మీలా ఆంటీకి మతిమరుపేం లేదు. నేను నిన్నగాక, ఆ మొన్న గాక, అటు మొన్ననేగా వచ్చాను!" అంది మహతిచిరునవ్వుతో వ్రేళ్ళుముడుస్తూ తెరుస్తూ.
    పైపు చేతిలోకి తీసుకొనిగొల్లున నవ్వాడు ప్రొఫెసర్ పరశురాం. మీ....ఆంటీకీ...." పైపు పొగా.....నవ్వూ గొంతులో నేను ముందంటే నేను ముందనడం వల్ల పొలమారినట్లుఅయ్యింది పరశురాంకు. "ఏమిటి మహతీ, మీ అంకుల్ నా మీద ఏదో పితూరీలు చెబుతున్నారు?" ప్రొఫెసర్ స్టడీ రూంలోకి ప్రవేశించి అడిగింది వసుంధర. "ఆ, ఏం లేదు. మీ ఆంటీ రోజు రోజుకు కొత్తస్టీల్ బిందెలాగుండ్రంగా పొంకంగా...." "చాల్లే సరసం" వసుంధర భర్త మాటకు అడ్డం వచ్చింది. "ఆంటీకేం అంకుల్?" "అదేనమ్మా నేనూ అంటూంట. పూర్తిగా చెప్పనిస్తేగా? కొత్త స్టీల్ బిందెనుచూసినట్టుగా మీ ఆంటీని చూడగానే నా కళ్ళు తళతళలాడిపోతున్నట్టుగానాకే అన్పిస్తుంది" అంటూ పకపక నవ్వాడు పరశురాం. మహతి శృతికలిపింది.    వసుంధర ముసిముసిగా నవ్వుకుంది.
    "ఇంతకి అసలు విషయం చెప్పనేలేదు మహతీ" "ఏమిటి ఆంటీ" "అదే నేను వచ్చేసరికి...." "ఓ అదా ఆంటీ! అంకుల్ కు రోజురోజుకూ మతిమరుపు ఎక్కువైపోతోంది. నేను రెండు రోజుల క్రితం వచ్చి వెళ్ళానా? అంకుల్ కు గుర్తే లేదు. ఎన్నో రోజులైందటనేను కన్పించి. పైగా మీ ఆంటీకూడా ఆ మాటే అంటోందంటున్నారు అంకుల్" వసుంధరకు పితూరీ చెప్పినట్టుగా చెబుతూ పరశురాంకేసి అల్లరిగా చూసింది మహతి.
    "అయ్యో రామ! మీ అంకుల్ సంగతి ఎందుకడుగుతావులే! ఆయన తన పుస్తకాలూ, ప్రయోగాలూ ఇంకా....." "ఇంకా పేరంటానికి వెళ్ళలేదా?" ప్రొఫెసర్ భార్య మాటలకు అడ్డం వచ్చి అడిగాడు. "పేరంటానికా?" వసుంధర ఆశ్చర్యపోయింది. "అదేమిటోయ్ అంతఆశ్చర్యపోతావ్? నువ్వేగా అన్నావ్ నాలుగింటికీ పేరంటానికెళ్ళాలని?" పరశురాం పైపును పెదవులమధ్య బంధించాడు.
    "సంపాదించింది చాలుగాని ఇక ఈ ఉద్యోగం మానెయ్యండి" పరశురాం పైపు పొగ వదులుతున్నాడు. మహతి ప్రశ్నార్ధకంగా చూసింది. "పాడుకేసులూ మీరూ! కొన్నాళ్ళుపోతేనన్నే మర్చిపోయేలాఉన్నారు. ఉద్యోగం మానెయ్యండి" "అసలు ఇంతకీ ఏం జరిగింది ఆంటీ? మీరు పేరంటానికి వెళతానని అననేలేదా?" మళ్ళీ మహతి వసుంధరను అడిగింది. "అన్నానమ్మా!" "అదుగో! విన్నావా మహతి! అసలు మతిమరుపుతనకే వచ్చేసింది పైగా" "చాల్లే ఊరుకోండి" "అవును ఆంటీ,  అంకుల్ అంటున్నది...." "నిజమేనమ్మా! కానీ ఆ మాట చెప్పింది ఇవాళకాదు. నిన్నఉదయం డాక్టర్ సుమతి శ్రావణశుక్రవారం నోము నోచుకుంది. పేరంటానికి పిల్చింది అదే మీ అంకుల్ కు చెప్పాను. పైగా నిన్ననే పేరంటానికి వెళ్ళి వచ్చాను". "డాక్టర్ సుమతి శ్రావణశుక్రవారం నోము నోచుకుందా?" ఆశ్చర్యంతో తల మునకలైపోతూ అడిగింది మహతి. "అవునమ్మా!" ?"అదేంటి ఆంటీ? ఆమె ఆ బాబ్డ్ హైర్ ఆ వేషం-- ఆమె వేష భాషల్లో ఇలాంటి చాదస్తాలు ఉన్నట్టు కనిపించదే?" "అదే తమాషా తల్లీ! ఈ కాలం వాళ్ళనుచూస్తుంటే నాకు జాలివేస్తుంది. ఒక్కోసారి కోపం వస్తుంది. డాక్టర్లూ-సైంటిస్టులూ-బాబాల పాదపూజచెయ్యడం - ఇలాంటిఆచారాలు పాటించడం-ఏమిటో - ఈ దేశం ఎటుపోతుందో-----" ఆలోచిస్తూ అంది వసుంధర.
    మహతి వసుంధరకేసి ఆశ్చర్యంగా చూసింది. "ఆంటీ, మరింత ప్రోగ్రెసివ్...." "అని అనుకోలేదు" మధ్యలో అందుకుని చెప్పసాగాడు ప్రొఫెసర్. "మీ ఆంటీ నాన్నగారు పెద్దసంఘసంస్కర్తమ్మా! మాకుపూల దండల పెళ్ళిజరిగింది. మీ ఆంటీఅలా ఉందిగాని----అబ్బో.....పెద్ద హేతువాది తెలుసా?" భార్యముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూశాడు పరశురాం. "నాకు చాలా ఆనందంగా ఉంది ఆంటీ! మీరు పెద్దగా చదువుకోక పోయినా ఎంతబాగా ఆలోచిస్తారు ఆంటీ! ఆ రోజుల్లో మీరు దండల పెళ్లి చేసుకున్నారా? ఎన్నేళ్ళయిందిఆంటీ?" కుతూహలంగా అడిగింది మహతి. "ముఫ్ఫయిఏళ్ళు....?" తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా సాలోచనగా అంది వసుంధర.
    "ముఫ్ఫయి ఏళ్ల తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా ఆంటీ? జీన్స్ వేస్తారు--బాబ్డ్ పెట్టుకుంటారు--కానీ పెళ్లి అనేసరికి తల వంచుకుని తలంబ్రాలు పోయించుకుంటున్నారు. అదీ పెద్దవాళ్ళ బలవంతం కాదు. నా క్లాస్ మేట్ వనజతల్లిదండ్రులకుదండల పెళ్ళి చెయ్యాలని ఉంది. కాని వనజ పట్టుబట్టి తనకు అన్ని హంగులతో పెళ్ళి జరగాల్సిందేనని చేసుకుంది. రకరకాలఫోటోలు. ఇదంతా కేవలం థ్రిల్ కోసం ఆంటీ!" "అదేనమ్మా! ఈ కాలంపిల్లలకు ప్రత్యేకమైన అభిప్రాయాలంటూ లేకుండా పోతున్నాయ్. ప్రతిదీ సర్ధాకోసం- థ్రిల్ కోసం- లేకపోతే ఆసుమతి శ్రావణశుక్రవారం నోము పట్టడం ఏమిటి చెప్పు" అంది వసుంధర.

Next Page