TeluguOne - Grandhalayam
Koti Yaabhai Lakshalu


                              కోటీ యాభై లక్షలు       
                                                               -కురుమద్దాలి విజయలక్ష్మి

 

                                   


    నేను దొంగని.


    ఈ మాట చెప్పుకోటానికి నేను సిగ్గుపడను. సిగ్గు పడకపోవటానికి కారణం నేను మగ మహారాజునని కాదు. ఇంతింతిలావు మీసాలు నా మూతిమీద వున్నాయని అంతకంటే కాదు.


    కారణం అతి చిన్నది.    


    ఈ లోకంలో ఘరానా పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్న ఎందరో మహానుభావులు వాళ్ళందరూ దొంగలే. కాని వాళ్ళు చెప్పుకోరు పెద్ద సత్యసంధుల్లా ఫోజుపెట్టి నేను జీవితములో అబద్ధము ఆది ఎరుగను (ఇదో పెద్ద అబద్ధం) అన్నట్లు మాట్లాడుతారు.


    ఈ ప్రపంచంలో అందరూ ఇంతో అంతో దొంగ పనులు చేసిన దొంగ వెధవాయిలే. పట్టుబడితే దొంగ పడకపోతే దొర.


    పూర్వం రాజుల కాలంలో రాజుగారు అయితే దొంగతనం చేసి పట్టుబడకుండా తిరిగిన దొంగగారికి బహుమతి ఇచ్చి సన్మానించేవాడట.


    ఇప్పుడు అలా కాదే. దొరల వేషంలో సంఘ సంస్కర్త లేక ఫలానా పని గొప్పగా చేశాడని... అదని...ఇదని...సన్మానం చేస్తున్నారు (చేయించుకుంటున్నారు) దొంగ వెధవలంగారికి.


    అంతే!


    పూర్వకాలంలోలాగా నేను ఫలానా ఫలానా దొంగపనులు చేశాను... అని చెపుదామా అంటే దండలతో సన్మానించపోగా దండిస్తూ తీసుకెళ్లి కటకటాల వెనక్కి తోస్తారు. కటకటా చోరాగ్రేసర చక్రవర్తులకి ఎంత కష్టం వచ్చింది?


    ఈ కష్టం గ్రహించే నేను దొంగనై వుండి, ఇప్పటిదాకా వందల కొద్దీ దొంగతనాలు చేసినా పట్టుబడని వాడనైనా పైకి ఈ మాట చెప్పి ఎరుగను.


    కారణం అతి చిన్నది.


    నేను దొంగని అని చెప్పిన మరుక్షణం ఎర్ర టోపీ, దొంగలు నన్ను శ్రీకృష్ణ జన్మస్థానంలో పడేస్తారు కాబట్టి పైకి చెప్పుకోదల్చుకో లేదు.


    చాకచక్యంగా దొంగతనాలు చేసి చేసి ఎంతగానో ఎదిగిపోయాను. మారువేషాలు వెయ్యటంలో ఎంత దిట్టమైనవాడినో పది భాషల్లో మాట్లాడగలగటంలో కూడా అంత దీటైన వాడిని.


    చోర మహారాజుగా ఇన్ని అర్హతలు వున్న నేను ఓ బాస్ గాడి దగ్గర కుడి భుజంగా చేరాను. మా బాస్ గాడికి మంది మార్ బలం వుంది గాని నా అంత బుర్ర (మేధ) లేదు. అయినా నా ఖర్మ సరీగా లేక బాస్ గాడి మోచేతికింద నీళ్ళు తాగక తప్పటంలేదు.


    అదృష్టంకొద్దీ వాడు నాకు బాస్ అయ్యాడు కాని...నిజం చెప్పాలి అంటే బాస్ గా వాడు అన్ ఫిట్. పచ్చి నిజం ఏదన్నా వుందీ అంటే నేను వాడికి బాస్ గా వుండవలసిన వాడిని.


    నా బాస్ గాడికి నేను బాస్ ని కావాలంటే నాకు రెండు అర్హతలు వుండాలి.


    ఒకటి నా బుర్రలో గుంజు బాగా వుండటం.


    వుంది.


    రెండు వాడి దగ్గరకన్నా నా దగ్గర డబ్బు ఎక్కువ వుండటం.


    లేదు.


    నా బుర్రలో తెలివికెమీ తక్కువలేదు కాబట్టి దాని గురించి బాధలేదు. ఏనాటికైనా బాస్ గాడికన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఆ డబ్బుతో బాస్ కే నేను మొగుణ్ని కావాలి.


    నా కోరిక ఉత్తుత్తి కోరికగా మిగిలిపోతుందేమోనని నిరాశా నిస్పృహలతో కాలం గడుపుతున్న నాకు మంచి అవకాశం రామ్ సింగ్ ద్వారా వచ్చింది.


    రామ్ సింగ్ పెద్ద స్మగ్లరు. చీకటి నేరస్తుడు. మహానుభావుడు, హంతకుడు కూడా. ఓ సేట్ గారిని హత్యచేసి ఒక కోటి యాభై లక్షల విలువగల వజ్రాలను చేజిక్కుంచుకున్న అదృష్టవంతుడు. దురదృష్ట గడియలు అతన్ని పట్టి పీడించటంతో రామ్ సింగ్ మా బాస్ కి దొరికాడు.


    రామ్ సింగ్ ని బాస్ బంధించాడు. అంతవరకు బాగానే వుంది. రామ్ సింగ్ హిందీ తప్ప తెలుగురాదు. మా బాస్ కేమో తెలుగుతప్ప మరే భాష రాదు. నాకు పది భాషలు వచ్చు.


    రామ్ సింగ్ ని బంధించిన బాస్ వంటరిగా నన్ను కలుసుకున్నాడు. చూడు గుండేరావ్! (నా పేరు అదే మరి) ఈ రహస్యం మనిద్దరి మధ్యనే వుండాలి. మన ముఠాలో అందరికీ తెలిస్తే వాటా ఇమ్మంటారు. రామ్ సింగ్ గాడికి హిందీ తప్ప మరేమీరాదు. అదేమో నాకు రాదు. ఒక..."


Related Novels