Next Page 

లేడీ కమెండో పేజి 1


                            లేడీ కమెండో !

                                                __ చందు హర్షవర్ధన్

   అర్దరాత్రి దాటి అరగంట అవుతుంది.
అప్జల్ గంజ్.....
సెంట్రల్ బస్ టెర్మినల్స్  ....
ఇరవైనాలుగు కారట్ల బంగారు వన్నెలా మెరిసిపోతున్న మేనిఛాయ ....దానికి తగ్గట్టు బ్లూ జీన్స్ ఫాంట్, పుల్ హండ్స్   రెడ్ షర్ట్ వేసుకున్న యువతి బస్ దిగి బయటకు వచ్చింది .
ఒక నిమిషం అలానే నిలుచుండిపోయి  నలువైపులా పరిశీలనగా చూసింది.
ఎక్కడో ఒక్కరో.... ఇద్దరో తప్ప జన సంచారం అంతగా లేదు.
విజయవాడ నుంచి బయలుదేరిన ఎక్ష్స్ ప్రెస్ సర్వీస్ మధ్యలో రిపేరుకు  గురై , నత్తనడకలా సాగుతూ, పురిటినొప్పులు పడుతూ అర్దరాత్రి సమయానికి హైద్రాబాద్ చేరింది .
ఆ సమయంలో సైదాపేటకు ఆటో మాట్లాడటమంటే  ఆటో డ్రైవర్ ఎంత దారుణంగా అడుగుతాడో ఆమెకు తెలుసు. ఆందుకే కాలినడకన బయలుదేరింది.
ముక్కులు పగిలేలా వస్తున్న దుర్గంధాన్ని భరిస్తూ చాదర్ ఘాట్ బ్రిడ్జిమీద కాలు పెట్టింది.
అంతవరకూ  ఆ బ్రిడ్జికి  దిగువున కూర్చుని బీర్ బాటిల్స్ ను ఖాళీ చేస్తున్న నలుగురు యువకుల దృష్టి ఆమెఫై పడింది.
వాళ్ళు ఒకరికొకరు  కళ్ళతోనే సైగచేసుకున్నారు.
మరు నిమిషంలోనే చేతిలోని బీర్ బాటిల్స్ ను మురుగులోకి విసిరి వేసారు .
పెద్ద పెద్ద అడుగులు వేస్తున్న అ  సుందరి తన వెనుక ఇంకెవరివో బూట్లచప్పుడు వినిపించి చటుక్కున ఆగి వెనక్కి తిరిగి చూసింది .
నలుగురు యువకులూ వెకిలిగా నవ్వుతూ కనిపించారు.
"హల్లో... వాట్స్ ద మాటర్... ఇలా అర్దరాత్రి రోడ్లవెంట పడ్డారేంటి ?" నడుముపై చేతులు వేసుకుని నిర్లక్ష్యంగా ప్రశ్నించింది ఆ యువతి.
మొదట ఆమె ధైర్యాన్నికి ఆశ్చర్యపోయినా, వెంటనే ఏమీ సమాధానం చెప్పకుండా, ఆమెనే నఖశిఖ పర్యంతం ఆశగా చూస్తూ పెదవులను చప్పరించసాగారు.
టైట్ జీన్స్ పాంటు, షర్ట్ లో నాగుపాములా నల్లగా వేలాడుతున్న జట... యాపిల్ పళ్ళవంటి నోరు ఊరించే బుగ్గలు... చెర్రిస్ ఫ్రూట్సు లా తడిగా వున్న ఎర్రని పెదవులు... మత్తుగొలిపే ఎదపొంగులతో... నెలవంకను మరపుకు తెచ్చేలా సన్నటి నడుము... పిరుదుల షేప్ చూసి డంగయిపోయారు.
 "యూ... పూర్ క్రీచర్స్... మీకు మాటలు రావా?"
"ఎలా వస్తాయి హానీ....నోరు ఊరించే రసగుల్లా ఉంటేనూ"
"ఛ... నిజంగా నేను అంత అందంగా వున్నావా? నాకు నమ్మకం లేదు."
నీ నమ్మకంతో మాకేంటి పిల్లా... జున్నుముక్కను జుర్రుకున్నట్టు నీ అందాలన్నీ మా స్వంతం చేసుకోబోతున్నాం. నిన్ను రేప్ చేస్తాం...."
"ఐసీ.... ఇప్పటివరకూ కేవలం రోడ్ రోమియోలనుకున్నాను. అయితే మీరు రేప్ వీరులన్నమాట"
విలాసంగా వాళ్ళను చూసి నవ్వింది ఆమె.
ఆమె మాటలను ఒక క్షణం ఖంగుతున్నారు. 'రేప్' అనే పదం వినిపించేసరికి దీనంగా ఏడవవలసిందిపోయి మరింత కేర్ లెస్ గా మాట్లాడుతుందేమిటి? తాము ఏం చేయబోతున్నామో తెలిసి వెంటనే కాలి సత్తువ కొద్దీ పరుగెత్తవల్సిందిపోయి, అందుకు విరుద్దంగా మొండి ఘటంలా మాట్లాడుతుందేమిటి?
ఏమిటి రేపిస్టులూ... బొమ్మాల్లా బిగిసుకుపోయారు?"
ఏమిటే, ఊరుకున్నకొద్దీ తెగ రెచ్చిపోతున్నావు" ఒకడు ఆవేశంగా ముందుకు వచ్చాడు.
"ఓరి ఊరకుక్కా....వాగడంకాదురా! నువ్వు మగాడివి అయితే చేయి కలపరా, ఈ ధీరజ చేతిదెబ్బ ఎలాంటిదో రుచి చూద్దువుగానీ" అంటూ మాటకు మాట బదులు పలికింది.
"ఏయ్... నీ పొగరు ఎలా దించాలో మాకు తెలుసులేవే."
పోట్లగిత్తల్లా రంకెలువేస్తూ నలుగురూ ఒక్కసారిగా ఆమెను కమ్ముకున్నారు.
అంటే... మరుక్షణంలోనే కొండరాయిని ఢీకొన్న పొట్టీళ్ళమాదిరి నలుగురూ నాలుగువైపులా రోడ్ మీద పడిపోయారు.
ఎడమకాలు ఏటవాలుగా వెనక్కు వాలి, కుడి మోకాలిపైకూర్చుని వున్న ధీరజ పిడికిళ్ళు బిగుసుకుపోయి వున్నాయి.
మెరుపు వేగంతో రైట్.. లెప్ట్.. అప్పర్... లోయర్... మిడిల్... పంచెస్ వెంట వెంటనే రిలీజ్ అయ్యాయి. సమ్మెటలతో బాదినట్టు ముఖాలు పచ్చడయిపోగా ముక్కుతూ మూలుగుతూ చెల్లా చెదురుగా పడివున్న తమకు ఏం జరిగిందో అర్ధం కావడానికి ఎంతో సమయం అవసరం లేకపోయింది.
కమాన్ రోగ్స్... పైకి లేవండి. ఆడది అబలకాదు అని ఇప్పటికయినా అర్ధమైందా?... కమాన్ ఓపిక తెచ్చుకోండి. ఇంకొకసారి చేయి కలుపుదాం" వాళ్ళను సవాల్ చేసింది.
ఆమె ఒంటిమీద చేయివేస్తె ఏమవుతుందో తొలి రౌండులోనే వాళ్ళకు అర్ధం అయింది. తమ ఎదురుగా వున్నది ఆడపిల్లకాదు, ఆడపులి అని గ్రహించిన వెంటనే కాలి సత్తువకొద్దీ పారిపోయారు.
చట్టుక్కున ముందుకు కదిలి వాళ్ళకు అడ్డుగా నిలుచుందామె.
సరిగ్గా అప్పుడే తెల్లని అంబాసిడర్ కారు అటుగా వచ్చింది. అర్డరాత్రి నడి రోడ్డుమీద ఎవరో గుంపుకట్టి వుండడం గమనించి ఆగిపోయింది ఆ కారు. అందులోనుంచి క్రిందకు దిగిన వ్య్యక్తిని చూడగానే వాళ్ళు మరింత ఖంగారు పడిపోయారు.
ఏ సి పి వీరీష్...
ముందువైపు ధీరజ... వెనకవైపు ఏ సి పి వీరేష్.
నలుగురు రౌడి యువకులనూ పచ్చివెలక్కాయ  నోటికడ్డు  పడ్డట్టు అయింది.
"లుక్ సర్... వీళ్ళు నాపై దౌర్జన్యం చేయబోయారు. నేనంటే ఏమిటో జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించాను. మీరు సమయానికి రాకపోతే వీళ్ళ ఎముకల్లో సున్నం ఎంతశాతం వుందో  పరీక్షించేదాన్ని. పాపం బాడ్ లక్__ మీకు దొరికిపోయారు."
"చూడు ధీరజా..."
"చూస్తూనే వున్నానుగా..."
"ఏమిటి...?"
"నా ప్రియమయిన వీరూని..."
"అబ్బబ్బ... రానురాను నీ ఆకతాయితనం ఎక్కువయిపోతూంది. ఆడపిల్ల ఆడపిల్లగానే వుండాలి తప్ప మగాళ్ళతో, అందునా రౌడీలతో తలపడడం మంచిదికాదు" అంటూనే వాళ్ళను గురించి దగ్గరలోని పెట్రోలింగ్ స్క్వాడ్ కు ఇన్ ఫామ్ చేశాడు వీరేష్.

Next Page