TeluguOne - Grandhalayam
Kaliyugamlo Sthri

                                      కలియుగంలో సీత

 

                                                                               __ కురుముద్దాలి విజయలక్ష్మి

                 

                                      

 

    
    "నువ్వు నా మాట విననప్పుడు నీమాట నేనెందుకు వినాలి" అవతల ఆఫీసుకి తిమవుతున్నా లెక్కచేయక భార్యతో పోట్లాటకి సిద్దమయ్యాడు రామచంద్రం.

 

    "మీ మాట నా మాట ఒకటే నేమిటి." అంది సామానులు సర్దే నెపంతో అటు తిరిగిన సావిత్రి.

 

    "కదా?" రెట్టించాడు రామచంద్రం.

 

    "కాదు" అంది సావిత్రి అలా అని వూరుకోవచ్చా ఓ చిలిపి చూపు రామచంద్రం మీద విసిరింది.

 

    "చూపులతో రెచ్చగొట్టటం, మాటలతో ఆమడ దురాన్నుంచటం ఇది మీ ఆడవాళ్ళకే చెల్లింది.

 

    "మా ఆడాళ్ళ నేదయినా అన్నారా ఊరుకోను, అ మీ మగాళ్ళు లేరు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అవసరం కాస్తా తీరక ఆమడ దూరం తోసేస్తారు."

 

    "ప్రేమగా దగ్గరికి తీసుకుందామంటే కట్టుకున్న భార్యే దగ్గరికి రాదు. పైగా మా సోదరుల మీద నిలపనిందలు . ఊహు ఇహ నే సహించేది లేదు. అంటూ ఒక్కంగలో సావిత్రి దగ్గరకొచ్చి ఆమెని తన వేపు తిప్పుకున్నాడు రామచంద్రం.

 

    "ఈ మొండితనం మీరు మానకపోతే లాభం లేదు. అంది" చిరుకోపంతో


    "ఏం చేస్తావేమిటి?"

 

    "మిమ్మల్ని విడిచి పోతాను" అంటూ రామచంద్రంకి దగ్గరిగా జరిగింది సావిత్రి.


    
    "అమ్మా, ఆశే: పోనిస్తానేమిటి?" అంటూ సావిత్రి పెదవుల మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు రామచంద్రం.

 

    సావిత్రి పెదవులతో పాటు బుగ్గలూ ఎర్రబడ్డాయి.

 

    "అయిదుగురు పిల్లల తండ్రి చేయాల్సింది యిదేనా?"

 

    "అయిదుగురు పిల్లలని కన్నతల్లి ఇలానేనా వుండాల్సింది?"

 

    ఎలా వున్నానేమిటి?"

 

    "రంభలా."

 

    రామచంద్రం మాటకి పరవశించిపోతూ "దాన్నెప్పుడు చుశారేమిటి?" అంది సావిత్రి.

 

    "స్నానం చేస్తున్నప్పుడో, బట్టలు మార్చుకుంటున్నప్పుడో చూశాను లెద్దూ," అన్నాడు సావిత్రి బుగ్గలు మరోసారి ఎర్రబడేలా చేస్తూ.

 

    "సీత చూస్తుంది."

 

    "అది స్నానానికి వెళ్ళింది."

 

    "బాబా చూస్తాడు."

 

    "వాడు ఫ్రెండింటికీ వెళ్ళాడు."

 

    "మీకు ఆఫీస్ టయిమయింది."

 

    "నాకు తెలుసులేవోయ్"

 

    "మీకు "ఏదో అనబోయిన సావిత్రి గుమ్మంలోకి వచ్చిన సీతని సీత....సీత వదలండి" అంది గాభరాగా.

 

    చటుక్కున సావిత్రిని వదిలేశాడు రామచంద్రం. "ఏది నా కాళ్ళజోడేది" అంటూ కంగారుగా ముందు గదిలోకి వెళ్ళిపోయాడు.

 

    పిల్లల ముందు ఇలాంటివి జరిగితే ఏ తల్లయినా ఎంత సిగ్గుపడుతుందో అంతకు రెట్టింపు సిగ్గు పడింది సావిత్రి. మొహం పక్కకు తిప్పుకుని అలమరలో డబ్బాలు సర్దుతూ వుండిపోయింది.

 

    సీత మరీ చిన్న పిల్లెంకాదు పద్నాలుగో ఏడు వచ్చి నాలుగు నెలలయింది. పదమూడో ఏటనే కొంప మునిగినట్టు పెద్దమనిషి అయింది. చదివే వార, మాసపత్రికలు, సినిమాలు ద్వారా ప్రపంచాన్ని చదివింది చూసింది వయసుకి మించిన తెలివితేటలు వున్నాయేమో ఇప్పుడు తల్లి తండ్రి వున్న తీరు చూసి జరిగింది గ్రహించి బోలెడు సిగ్గుపడింది.

 

    స్నానానికి వెళ్ళిన సీత అక్కడ సబ్బులేక, కొత్త సబ్బు తల్లి నడుగుదామని వంటింటి గడప దగ్గరకొచ్చింది. అలవాటుగా ఆఫీస్ కెళ్ళేముందు సావిత్రినోసారి దగ్గరికి తీసుకునే రామచంద్రం సీత స్నానానికి కెళ్ళటం, బాబా ఫ్రెండింటి కెళ్ళటం మిగతా పిల్లలు ఉదయమే బడి కెళ్ళటంతో ఏ మాత్రం ఆలస్యం చేయక వంటింట్లోకి వచ్చేశాడు. ఎప్పటిలా సావిత్రి వెంటనే దగ్గరికి రాలేదు.

 

    "ఈ అలవాటు మానకపోతే ఊరుకోను. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు." అంటూ పెచికి దిగింది. పిల్లలు పెద్దవాళ్ళయితే నా నోట్లో మట్టేనా?" అంటూ గునిశాడు రామచంద్రం. ఇలా పోట్లాడుతూ ఇద్దరూ దగ్గిరికి చేరారు. సీత సబ్బుకోసంరావటం, వంటింట్లో వాళ్ళిద్దరి లౌ సీను చూడటం జరిగింది.

 

    "ఇదిగో నే వెళుతున్నా తలుపెసుకో ముందు గదిలోంచి కేకేసి ఆఫీసుకి బైలుదేరాడు, రామచంద్రం.

 

    సబ్బు అడుగుదామని వచ్చిన సీత తల్లిని సబ్బడక్కుండానే స్నానికిక్కెళ్ళింది.

 

    లాభం లేదు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. రేపటి నుంచి ఆయన్ని పగటిపూట దగ్గరకు రానియకూడదు. అయన వేదించినా సరే చస్తే వప్పుకోకూడదు." అనుకుంది సావిత్రి.


Related Novels