Home » Merlapaka murali » Raaraa Maa Entidaakaa
నేనయితే మరీ ఘోరం - ద్వారం దగ్గరే వుండిపోయాను.
ణ అవలకం చూసి అతనే దేనికోసమో అటూ ఇటూ కళ్ళతోనే వెదుకుతున్నాడు. అప్పుడు స్పృహలోకి వచ్చాను నేను. పరుగున వెళ్ళి టవల్ తీసుకొచ్చి అందించాను.
"థాంక్స్" అన్నాడుశ్రీనాథ్.
అప్పటికి నా జంకు తీరింది.
"మన మథ్య థాంక్స్ లూ, సారీలు వద్దు" అన్నాను.
నేనంత ఫాస్ట్ గా మాట్లాడేసరికి తడబడ్డాడు.
బలవంతంగా నవ్వాడు.
తల తుడుచుకున్న తరువాత మా నాన్న లుంగీ, మా అన్నయ్య షర్టూ తీసుకొచ్చి ఇచ్చాను. లుంగీ కొత్తదేగానీ షర్టు మరీ పాతది. కానీ అంతకంటే గత్యంతరం లేదు మరి.
అతను ఓ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చాడు.
నేను అంతలో కాఫీ పెట్టి, రెండు కప్పుల్లో తీసుకొచ్చాను. ఒకటి అతనికి అందించి, ఇంకొకటి నేనుంచుకున్నాను. ఇద్దరం కాఫీ తాగడం మొదలుపెట్టాం.
"అమ్మా, నాన్న లేరా?" చాలాసేపట్నుంచీ అడగాలనుకుంటున్న ప్రశ్న అది.
"లేరు తడకు వెళ్ళారు. మరి కాసేపట్లో వచ్చేస్తారు"
అప్పటికే ఇద్దరం సర్దుకున్నాం.
ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం.
నేనెందుకు లెటర్ రాయాల్సి వచ్చిందో, ప్రాబ్లమ్ ఏమిటో చెప్పాను.
"నాకు నిజంగా తెలియదు. నీ లెటర్ చూసి ఏమోననుకున్నాను. ఇంత చిన్న సమస్య అనుకోలేదు. అమ్మా వాళ్ళు కూడా చెప్పలేదు" అన్నాడు.
"మీ దగ్గర్నుంచి లెటర్ రాకపోతే మరో సంబంధం చూసుకొమ్మని లెటర్ రాస్తానన్నారు నాన్న. నాకు దిగులేసింది. ఇంత చిన్న సమస్యవల్ల పెళ్ళి ఆగిపోవడం ఇష్టంలేక పోయింది. మీకు చెబితే మీరు మీనాన్నకు నచ్చచెబుతారనే లెటర్ రాశాను"
"తప్పకుండా మా నాన్న కూడా మహా గట్టిపిండం. తను పట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అనే రకం. బంధువులంటే ఆయనకి మహాప్రీతి. అందరూ రావడానికి వుంటుందని అక్కడ చేయమని అంటున్నాడు కాబోలు" అన్నాడు శ్రీనాథ్.
"కానీ మా వేపునుంచి కూయా ఆలోచించాలి కదా"
"అవునవును - నాన్నకు నేను చెబుతానులెండి"
"థాంక్స్"
"మీరేకదా మన మధ్య థాంక్స్ వద్దంది. తిరిగి మీరే థాంక్స్ చెబుతున్నారు" అన్నాడు.
చప్పున సిగ్గేసింది నాకు.
"సారీ" అన్నాను.
"అది కూడా వద్దన్నట్టు గుర్తే"
ఇంకేం చెప్పాలో తెలీక నవ్వుతూ వుండిపోయాను. మధ్యలో మరో పది నిముషాలకి అతను బయల్దేరాడు.
బయట వర్షం బలంగా పడుతోంది. సాయంకాలం ఆరుగంటలే అయినా చీకట్లు కమ్మేశాయి.
ఆ రాత్రికి అతన్ని వుండమనాలో, వెళ్ళిపొమ్మనాలో నాకు తెలియడం లేదు.
"వుండండి బస్సెప్పుడో కనుక్కుంటాను" అని బస్టాండ్ దగ్గరున్న ఓ హోటల్ కి ఫోన్ చేశాను.
"బస్సులు వెళ్ళడం లేదట. ముందున్న ఏరు పొంగుతూ వుందట. ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. వాగు ఇప్పుడల్లా తగ్గేటట్లు లేదంటున్నారు" అని చెప్పాను మౌత్ పీస్ దగ్గర చేయి అడ్డం పెట్టుకుని.
"ఇప్పుడెలా?" అతను ఆందోళనపడ్డాడు.
ఫోన్ లో మరోసారి అడిగినా అదే జవాబు వచ్చింది.
ఫోన్ పెట్టేసి - "మరి ఏం చేస్తారు? వుండి రేపు ఉదయం వెళ్ళండి. ఇప్పుడు రైలు కూడా లేదనుకుంటాను" అన్నాను.
"అలా బస్టాండ్ కి వెళ్ళి ఏమయినా మార్గం వుందేమో చూస్తాను" అని బయల్దేరాడు. నేను అడ్డు చెప్పలేదు.
మరో అరగంటకు తిరిగి వచ్చాడు.
ఏరు ఉధృతంగా ప్రవహిస్తోందని చెప్పాడు.
నేను వంట ప్రారంభించాను.
ఇప్పుడు మరింత ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం. కొత్త మనుషుల మన్న ధ్యాస కూడా పోయింది. చుద్వుల దగ్గర్నుంచి, అభిమాన హీరో హీరోయిన్ల వరకు అన్ని విషయాలు దొర్లుతున్నాయి.
అమ్మా నాన్నకు కలిపి మొత్తం నలుగురికి వంట చేశాను.
వర్షం ఆగకుండా కురుస్తోంది. గాలి కూడా ఎక్కువయింది. నిలువెల్లా తడిసిపోతున్న ఇల్లు గుండెలు బాదుకుంటున్నట్లు తలుపులు, కిటికీలు కొట్టుకుంటున్నాయి. నేను లేచి అన్నీ బంద్ చేశాను.
టైమ్ ఎనిమిదికి పైగా అయింది. ఇక ఆ వర్షంలో అమ్మా వాళ్ళు రారేమోనన్న సందేహం వచ్చింది.
వాళ్ళు రాకపోతే మేమిద్దరమే అన్న భావన గుబులు పుట్టిస్తోంది.
అమ్మా వాళ్ళు వస్తే ఏం చెప్పాలో ముందే నిర్ణయించుకున్నాం. ఆఫీసు పనిమీద వచ్చానని, చూసి వెళదామని ఇటొచ్చినట్లు తను చెప్పేటట్లు అనుకున్నాం. అమ్మా వాళ్ళు వస్తే ప్రమాదం లేదు - రాకపోతేనే తంటా.
వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు గనుక భోజనానికి లేవమన్నాను. నేను భోం చేస్తే తను భోంచేస్తానన్నాడు. ఇద్దరం ఆ కార్యక్రమాన్ని ముగించాం.
తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా వున్నట్లుంది. ఆకాశం తూట్లు పడ్డట్టు వర్షం భోరున కురుస్తోంది.
సడన్ గా లైట్లన్నీ డిమ్ అయ్యాయి. సింగిల్ ఫేస్ లో కరెంట్ వస్తున్నట్లుంది. ట్యూబ్ లైట్లు వెలగడం లేదు. మిగిలిన లైత్లి ఎర్రటి గీతల్లా మండుతున్నాయి. ఛాయా మాత్రంగా తప్ప ఏమీ కనబడడం లేదు. హాల్లో తప్ప మిగిలిన లైట్లూ, ఫ్రిజ్ ఆఫ్ చేశాను.
లైట్లు లేకపోవడంతో ఏదో అర్ధంకాని సంచలనం నాలో అతని పరిస్థితి కూడా అంతే. నేనేదో అడగడం, అతనేదో చెప్పడం వల్ల ఇద్దరమూ మామూలుగా లేమన్న విషయం అర్ధమయింది.
అంతా కొత్త కొత్తగా, మత్తు మత్తుగా, గమ్మత్తుగా వుంది. యిలాంటివన్నీ అనుభవించాలే తప్ప మాటల్లోకి అనువదించడం కష్టం.
ఉరుములు, మెరుపుల వల్ల రాత్రి మరింత భయానకంగా వుంది. చిమ్మ చీకటి చుట్టూ చుట్టుకుంటోంది.
సింగిల్ ఫేస్ కరెంట్ కూడా పోయింది.
ఏమీ కనిపించడం లేదు.
"దేవుడి గదిలో బ్యాటరీ వుంది. తెస్తానుండండి..." అంటూ లేచాను.
"ఈ చీకటిలో ఏం వెదుకుతారులెండి... నా జేబులో మ్యాచ్ బాక్స్ వుంది పట్టుకొస్తాను" అన్నాడు.
అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను లేచాను.
రెండు అడుగులు వేశానో లేదో ఇద్దరం బలంగా గుద్దుకున్నాం. అతను ముందుకు వెళ్ళడానికి చేతులు చాచి అడుగులు వేశాడు. ఆ చేతులు ఖచ్చితంగా నా ఎదమీద పడ్డాయి. నాలో మెరుపు మెరిసినట్లయింది. నాచేతులూ అతని భుజం మీద పడ్డాయి.



