Home »  » Ladies Special

మరకలు పోగొట్టేద్దాం... మెరిపించేద్దాం...!

మనం నచ్చిన బట్టల పైన కానీ, ఏదైనా వస్తువుల పైన కానీ మరకలు పడిన లేదా జిడ్డుగా మారి దుర్వాసన వచ్చేలా అయితే మనకు చాలా బాధగా ఉంటుంది కదా! మరి అలాంటపుడు ఆ మరకల నుండి, దుర్వాసనల నుండి మన వస్తువులను ఎలా కాపాడుకోవాలో ఒకసారి చూద్దామా...!

చెమట మరకలు : చెమట మూలంగా షర్టులు, బ్లౌజులు మరకలతో దారుణంగా తయారవుతాయి. చూడడానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటాయి. అందువల్ల ముందుగా ఆ మరకల వద్ద లిక్విడ్ డిటర్జెంట్ సబ్బుతో రుద్ది, ఆ తర్వాతే సబ్బుతో ఉతికి చూడండి. మరీ మొండి చెమట మరకలైతే మాత్రం వెనిగర్ తో కేవలం ఆ ప్రాంతాన్నిమాత్రమే రుద్ది, ఆ తర్వాత మాములుగా సబ్బుతో కడిగేయవచ్చు. వెనిగర్ లేకుండా గోరువెచ్చని నీటిలో నాలుగు ఆస్పరిన్ బిళ్ళలు వేసి, ఆ నీటిలో దుస్తులు నానబెట్టి ఉతికేయండి. మరకలు మాయమైతాయి. తెల్లని దుస్తులైతే మాత్రం కాస్త హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను మరకలపై కొద్దిగా రాసి అయిదు నిముషాల తర్వాత ఉతకండి.

లిప్ స్టిక్ బాల్ పెన్ మార్క్స్ : ముందుగా మరకపడిన బట్టను ఓ పాత టవల్ పై ఉంచండి. మరకపైకి వచ్చేలా ఉంచి ఓ చిన్న పాత గుడ్డను ఆల్కాహాలులో ముంచి దాన్ని మరకపై తట్టినట్టుగా పదేపదే చేయండి. ఆ తర్వాత వాష్ చేయండి. మరకలు మరీ జిడ్డుగా అంటుకున్నట్లుగా అనిపిస్తే కిరోసిన్ తీసుకుని మరకపై పూసి అయిదు నిముషాల తర్వాత శెనగపిండితో గట్టిగా రుద్ది కడిగేయండి.

కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు : అందమైన, ఖరీదైన కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు పడితే... అందుకే ఓ స్టీలు గిన్నెలో ఐసుముక్కలు వేసి దాన్ని ఈ క్యాండిల్ చుక్కలపై కాసేపు ఉంచండి. చల్లదనానికి ఈ క్యాండిల్ వ్యాక్స్ మరింతగా గట్టిగా మారుతుంది. అప్పుడు ఏదైనా స్పూన్ మొనతో దానిని చెక్కేసి బ్రష్ తో శుభ్రంగా తొలగిస్తే సరిపోతుంది.

డిన్నర్ ప్లేట్ లపై పసుపు రంగు : ప్లాస్టిక్ ప్లేట్లపై పసుపు మరకలు తొలగించాలంటే ప్లేట్లను గోధుమ పిండితో గట్టిగా రుద్ది కడిగేయండి చాలు. నిత్యం వాడే బకెట్లు మగ్ లపై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే ముందుగా వాటిని కిరోసిన్ లో తడిపిన గుడ్డతో గట్టిగ తుడిచి, ఆ తర్వాత సబ్బుతో కడగాలి.

ప్లాస్కు దుర్వాసన: ప్లాస్కు లో దుర్వాసన పోవాలంటే నాలుగైదు కోడిగుడ్డు పెంకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని ప్లాస్కులో వెయ్యాలి. దానిపై వేడినీటిని పోసి మూతపెట్టాలి. మధ్యమధ్యలో బాగా కదిలిస్తూ ఓ గంటన్నర పాటు ఉంచండి. ఆ తర్వాత సబ్బుతో కడిగేయండి. ఇక పొడిగా ఉండేలా తుడుచుకున్న తర్వాత ఓ చెంచాడు పంచదార అందులో వేసి మూతపెట్టి దాచుకోండి. దుర్వాసన రాకుండా తాజాగా ఉంటుంది.

 


Related Novels


Dasara 2025 Vijayawada Durga Devi

Dasara 2023 Vijayawada Annapurna Devi

Dasara 2023 Vijayawada Gayatri Devi

Dasara 2023 Home

More