Home » » Jokes
Iddarilo Yevaru Donga
.png)
ఇద్దరిలో ఎవరు దొంగ
కవిత, నవ్య ఇద్దరూ పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు.
ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికిన తరువాత "బాల్
లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" అని చెప్పింది ఓడిపోయేట్టున్ననవ్య.
"ఇదిగో దొరికింది" తన దగ్గరున్నబంతిని పడేసి అరిచింది కవిత.
"బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?" అని నిలదీసింది నవ్య.
"నిజం నవ్య... నాకు దొరికింది" అని చెప్పింది కవిత.
"ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?" అని గబుక్కున నాలిక్కరుచుకుంది
నవ్య.