శ్రీకృష్ణుని అష్టసఖులెవరో తెలుసా...

 

శ్రీకృష్ణుని అష్టసఖులెవరో తెలుసా.......

Srikrishna Radha with ashtsakhi

 

మానసచోరుడు, వేణుగాణలోలుడు, మాధవుడు... గోకులములో ప్రతి గోపిక మనసున నిండిపోయినవాడు. గోవిందుని రాకకై నిరంతరం ఎదురుచూసేవారు గోపికలు.. బృందావనిలో గోపాలుని పదముల చేరాలని పరుగులు తీయని గోపిక వెదికిన కనపడదేమో..ఆ కమనీయ రూపుని కనులార చూడాలని ప్రతిదినం బృందావని చేరే గోపికలలో శ్రీకృష్ణుని అత్యంత ఇష్టసఖి రాధ. రాధతో పాటు కృష్టుణికిష్టమైన మరో ఎనిమిది మంది సఖులున్నారు. వారంటే గోవిందునికి ఎంతో ప్రీతి. రాధేయుడి అష్ట సఖులు లలిత, విశాఖ, చిత్ర, ఇందులేఖ, చంపకలత, రంగదేవి, తుంగవిద్య, సుదేవిలు అష్టసఖులు. మధురలో వీరికి మందిరం వుంది. వీరే కాక గోవిందుడికి పదహారు వేల మంది గోపికలుండేవారట. వీరి ఆటపాటలతో బృందావనం ఆనందనందనంగా వెలుగొందినదని పురాణ కథనం. ఆ గోవిందుడు అలా గోపికలందరివాడై ప్రేమామృతాలను పంచాడు.


More Krishnudu