వారి ముందు మనమెంత?

 



ఒకదాన్లో విఫలమైనంత మాత్రాన మనము ఎందుకు పనికిరామని అనుకోకూడదు . దిగులు చెంది ఆలోచనలు చిదిమేయవద్దు . అన్ని ప్రయోగాలూ ఒక ప్రయత్నంలోనే ఫలించవు. ఎన్నో ప్రయోగాల అనంతరమే ఐన్‌స్టీన్‌, ఎడిసన్‌ వంటివారికి విజయాలు వరించాయి. వారి ముందు మనమెంత? మన ప్రయత్నాలెంత? అలాంటి మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అడుగు ముందుకేయాలి. మొదటి ప్రయత్నంలోనే గెలుపు సాధించడానికి మనకేమీ అతీంద్రియ శక్తులు దేవుడు ఇవ్వ లేదు . పసిపాప నడక నేర్వడానికి ముందు ఎన్నోసార్లు పడిపోతారు . అయినా విసుగెత్తక వారు నడిచేవరకూ ప్రయత్నిస్తూనే వుంటారు. పడ్డాను కదాని కూర్చుంటే ఆ నడక సాధ్యమేనా? అది చాలద మనకు జీవితపాఠం నేర్వడానికి! చిన్న చిన్న దెబ్బలకే నిరాశకు గురై ఆత్మవిశ్వాసం కోల్పోయేవారు ఈ వాస్తవం తెలుసుకోవాలి. ఒకసారి విఫలమైతే జీవితం అంతమైపోదు. ఒకసారి అడుగు తడబడితే బతుకేమీ నాశనమైపోలేదు. కాబట్టి . 'కృషితో నాస్తి దుర్భిక్షం'! ఈ మంత్రాలు చాలవ గెలుపుబాట పట్టడానికి.

-మీ అనిల్


More Good Word Of The Day