భోజన వేళలో శుభాశుభ శకునాలు...

 

Telugu Nammakaalu, Shubha Sakunam, Ashubha Sakunam, Shubha Sakunam In Telugu, Good Will   Hunting



శుభం, అశుభం ఫలితాలు మనకు కలిగే ముందు అనేక రకాలైన అనేక శకునాలు వాటి గురించే ముందే సూచిస్తుంటాయి. అలాంటి శకునాలు అనేకం వున్నాయి. భోజన సమయంలో ఎలాంటి శకునం, ఎలాంటి శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తుందో తెలుసుకుందాం.

భోజనం చేస్తుండగా హఠాత్తుగా వర్షం పడితే మంచి జరుగుతుంది. పచ్చదనం, సమృద్ది కలుగుతుంది.  భోజనం చేసేటప్పుడు కాకి వచ్చి తలపై కూర్చుంటే అశుభం. అలాగే కాకి భోజన సమయంలో కుడిభుజంపై వాలితే కడుపులో వికారం, ఎడమ భుజంపై వాలితే కులనాశకుడవటం జరుగుతుందని సూచన.

 


భోజనం చేసే వేళలో కుక్క ఏడుపు వినిపిస్తే అశుభసూచన. అలాగే అవి మొరుగుతే, ధాన్యం దొంగతనం అవుతుందనటానికి సంకేతం.


ఏదైనా వివాదం భోజనం చేస్తున్నప్పు ప్రారంభమైనా అది అశుభం. ఆ ఇంట్లో అన్నానికి కొరత ఏర్పడుతుంది.
తినేటప్పుడు ఏడుపు శబ్దం వినిపిస్తే, విన్న వారికి ఆరోగ్యం దెబ్బ తింటుందని సూచన.
రొట్టె ఎక్కువగా కాలి మాడిపోతే ఆహార నష్టం జరుగుతుందని గ్రహించాలి.

 

 

ఆ సమయంలో పాము కనిపిస్తే అశుభంగా పరిగణిస్తారు. భోజన సమయంలో పాము కనిపిస్తే భోజనంలో విషం కలిసిందన్న అనుమానానికి కారణం అని  పండితుల అభిప్రాయం.

ఇవి భోజన వేళలో శకునాల వల్ల కలిగే, శుభ, అశుభ పరిణామాలు. శకునాలు మనకు సూచనలు మాత్రమే. వాటికి సంబంధించిన పరిహారాలు, అశుభ శకునాల నుంచి పరిగ్రహించుకొనుటకు మార్గాలు కూడా ఉంటాయి. సూచనలుగా శకునాలను గ్రహించి జాగ్రత్త వహించటం ఎంతైనా మేలు.


More Good Word Of The Day