xt-align: center;"> పాపాలు తొలగించు పాలాభిషేకం

 


మానవుల కోరికలు, పాపాలు, అసంతృప్తులో వారి దుఃఖానికి కారణం. దీని వలనే మనం అశాంతి పాలవుతుంటాం. అలాంటప్పుడు పరమేశ్వరుడిని  అభిషేకిస్తే పాప విముక్తులయి, దుఃఖం దూరమవుతుంది. ఆనందం ఆదిదేవుని ఆశ్వీర్వాదంగా లభిస్తుంది.

శివుడు అభిషేక ప్రియుడని భక్తులందరికీ తెలుసు. ఆ మహాదేవునికి అభిషేకానిసి నీళ్లు, పాలు,  కొబ్బరినీళ్లు,  చెరుకురసం,  పండ్ల రసాలు లాంటి ద్రవ్యాలు వాడుతుంటారు.  ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఒక్కో ఫలితాన్ని పొందవచ్చని చెబుతుంటారు. పరమశివుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన, దుఖాల నుంచి విముక్తి లభిస్తుంది.

జీవితంలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన వ్యథ. ముఖ్యమైన కార్యాలలో విజయం లభించకపోవడం, అనుకున్న పనులు నెరవేరక పోవడం, ఆటంకాలు ఏర్పడటం, అయినవాళ్లు ఆపదలు, అనారోగ్యం పాలవడం లాంటివి ఎన్నో. అన్ని రకాల  దుఃఖ బాధల నుంచి విముక్తికి  పరమశివుడి అనుగ్రహమే మార్గం.  ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవుపాలతో అభిషేకం చేయాలి. తద్వారా పాపవిముక్తి, భగవత్ అనుగ్రం కలుగుతాయి.


More Good Word Of The Day