నిత్య జీవితంలో గీత

 



భగవత్ గీత  సర్వసాస్త్రాలని తనలో ఇముడ్చుకుందని .. పారాయణ మాత్రం చేత మోక్షాన్ని సైతం అందించ గలదని చెబుతారు. " మోక్షాన్ని సైతం " అంటే  మోక్షమే ఇవ్వగలిగినది .. ఇహ లోకంలో దేనిని అయనా అందించ గలదని అర్ధం. పారాయణ మాత్రం చేత మన కోరికలు అన్ని తీర్చగలదు అంటే , ఇందుకు పెద్దలు ఒక కథ చెబుతారు. ఒక ఊరిలో ఓ పండితుడు వుంటాడు . చాలా శాస్త్రాలు చదివినవాడు. మోక్షం కోసం అని భగవత్ గీత ని కూడా రోజు పారాయణ చేసేవాడు. అదే ఊరిలో ఓ కట్టెలు కొట్టుకు వచ్చి అమ్ముకునే ఓ పేద వ్యక్తీ వున్నాడు. అతనికి శాస్త్రాలు తెలియదు, గీతా సారం తెలియదు . ఇద్దరు వయసు నిండి మరణించిన తర్వాత దేవదూతలు వెంటనే వచ్చి ఆ పేద వ్యక్తిని స్వర్గ లోకానికి తీసుకు వెళతారు. తన కంటే ముందు పేద వానికి స్వర్గలోక ప్రాప్తి కలగటం చూసి ఆ పండితుడు, దేవదూతలని " ఇదేంటి సర్వసాస్త్రాలు పటించిన వాడిని, గీతని రోజు పారాయణ చేసిన వాడిని నాకు కాక అతనికి ముందు స్వర్గలోక ప్రాప్తి ఎలా కలిగింది " అని అడుగుతాడు. దానికి ఆ దేవదూతలు ఇలా చెబుతారు... "నువ్వు పారాయణ మాత్రమే చేసావు. ఆ శాస్త్రాల సారాన్ని గ్రహించి నీ జీవితానికి అన్వయించు కోలేదు.  అతనికి ఏ శాస్త్రం తెలియదు. గీతాసారం కూడా ఎరుగడు. కాని తన జీవితంలో ప్రతి పని వాటికి అనుగుణంగా చేసాడు. అందుకే పటించిన నీకంటే, పాటించిన అతనికే మొదటి ప్రవేశం" ఈ చిన్న కథ ద్వారా మన పెద్దలు మనకి చెప్పదల్చుకున్నది,. "పారాయణ చేస్తే కష్టాలు తోలుగుతాయంటే, వాటిలోని సారాన్ని గ్రహించి  ఆచరణ లో పెడితే .., మన జీవితంలో ఎదురయ్యే సమస్యలని దాటటం కష్టంగా తోయదు. ఎప్పుడు ఎలా మసులు కోవలో తెలిస్తే ఎన్నో సమస్యలు సులువుగా దాటగలం."


   భగవత్ గీత లోని ప్రతి శ్లోకం మనకి ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో, ఏది మంచి, ఏది చెడు దాకా నిత్యం మనకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి సమధానం చెబుతుంది . అందుకే గీతా పారాయణ ఒక్కటి చాలు బాధ ని పోగొట్టటానికి అనేది. గీత లోని  ఈ శ్లోకాన్నే చూడండి ..మన జీవితానికి ఎంత మార్గ నిర్దేశం చేస్తుందో.

యదా సంహరతే చాయం కూర్మోఙ్గానీవ సర్వశః|
ఇంద్రియాణీంన్ద్రీయార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-58


తాబేలు నేర్పే పాటం
తాబేలుని చూడండి ఏ కొంచం శబ్దం గాని, అలజడి గాని కలిగితే వెంటనే తన అవయవా లన్నిటిని లోపలకి (చిప్పలోకి ) ముడుచు కుంటుంది. దానికి తన అవయవాలు అంత స్వాదీనం లో వుంటాయి. మనం కూడా మన ఇంద్రియాలను అలా అధినం లో ఉంచుకోవాలని చెబుతోంది ఈ శ్లోకం. అలవాటుగా అవి చెడు విషయాల మీదకి మళ్ళినా, వాటిని వెంటనే ఆదీనంలోకి తెచ్చుకుంటే , సమస్యలు రావు . ఇంకో మాటలో చెప్పాలంటే ఇంద్రియాలని ఆదీనంలో వుంచుకుంటే.. జ్ఞానం స్థిరంగా ఉంటుందని సాధకులు అన్వయించుకుంటే , సామాన్యులు "మనసు ఎప్పుడు మన బుద్ధికి లోబడి వున్నప్పుడు మంచి , చెడు విశ్లేషణ సాధ్య పడుతుందని, ఆ విశ్లేషణ మనల్ని వివేకులని చేసి సమస్య లని కొని తెచ్చుకోకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా ఒకో శ్లోకం మనకి మార్గనిర్దేశం చేసే దీపం లాంటిది. ఆ వెలుతురు లో ప్రయాణం చేస్తే గమ్యం చేరటం సులువు అవుతుంది.

-రమ


More Enduku-Emiti