తాబేలు నేర్పిన ఓ మంచిమాట

 

 

అనాదిగా సృష్టిలో ప్రతి జీవీ తనకంటూ ప్రత్యేకమైన ధర్మాలను కలిగివుండి వాటి ద్వారా మనకు ఎన్నో విషయాలు నేర్పుతున్నాయి. అలాంటి పురాతన జీవి తాబేలు నుంచి కూడా మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు.  తాబేలు అన్నా కూర్మం అన్నా ఒకటే. అలాంటి తాబేల్లు జల, భూచరాలు. ఎంతో కాలం జీవించే తాబేలు మనకు స్థితప్రజ్ఞత గురించి నేర్పుతుంది. అది ఎలా అంటే...

తాబేలు అవయవములను చూడండి, అవి అలవాటు ప్రకారం వాటంతటవే బయటకు ప్రసరిస్తాయి. కాని, ఏమాత్రం అపాయము ఎదురైనా, వెంటనే లోపలికి ముడుచుకుపోతాయి. సంకల్పించుకున్న తక్షణమే, జాగు లేకుండా అవి ముడుచుకుపోతాయి. అలా తాబేలు అవయవాలు దాని స్వాధీనములో పూర్తిగా ఉంటాయి. అలా మనం కూడా యింద్రియాలను స్వాధీనములో ఉంచుకోవాలి.  మానవ సహజ లక్షణం ప్రకారం యింద్రియాలపై అదుపు కోల్పోతుంటారు. అలా అలావాటు ప్రకారం నిగ్రహం లేకుండా ప్రవర్తించుట మానివేసి, ప్రయత్న పూర్వకంగా సంకల్పించి మనసును, యింద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకొని మసలుకోవాలి. ఇది తాబేలు మనకు నేర్పు విషయం.


More Good Word Of The Day