xt-align: center;">ఆయుధం కన్నా పదునైనది మాట

 



ఈ ప్రపంచంలో చాల రకాల జీవరాసులు ఉన్నాయి. జంతువులు,పక్షులు, మనుషులు అన్ని ప్రాణులే. కాని 'మనిషి' అనే ప్రాణికి అన్ని జీవరాసుల్లో కన్నా ప్రత్యేకమైన స్థానం ఉంది. మనిషి సాంఘిక జీవి,అన్ని జీవరాసుల కన్నా తెలివి ఉంది..ఒకరి భావాలను ఒకరు 'మాట' ద్వార తేలికగా తెలుసుకో గలరు,అర్ధం చేసుకో గలరు.. ఆయుధం కన్నా పదునైనది 'మాట'. ఆ 'మాట' ఆలోచనాత్మకంగా ఉండలేగాని అవమానించేలా ఉండకూడదు. మన మాటలు ఎదుటివారిని ఉత్తేజ పరిచేవిగా ఉండలేగాని వెటకారంగా ఉండకూడదు. అర్ధం చేసుకునేలా ఉండాలేగానే కించపరిచేలా ఉండకూడదు. నీకు శత్రువునైన మిత్రువులనైన సృస్టించగలిగే సృష్టికర్త నీ మాట. నలుగురిలో నిన్ను తలఎత్తుకు నిలబడేలా చేయలన్నా నీ మాటే - అదే నలుగురితో ఛీ కొట్టించుకోవలన్నా నీ మాటే కారణం. పదిమందీ నిన్ను అభిమానించాలంటే ఆప్యాయంగా పలకరించే నీ మాటే కారణం. అదే పది మంది నిన్ను అసహ్యించు కోవాలంటే నీ నుంచి వచ్చే అసబ్యాకరమైన నీ మాటే కారణం. ప్రాణులన్నీటిల్లోకల్లా ఒక్క మనిషికే ఆలోచనాశక్తి ఎక్కువగా ఉంటుంది. మనం జంతువులంకాదు మనుషులం కాబట్టి మాటలు ఆలోచించి సక్రమంగా మాట్లాడితే నీతో పాటు నిన్ను అభిమానించే పదిమంది ఉంటారు. లేదు అనాలోచితంగా, అసహనంగా, అసభ్యకరంగా, అవ్యవహరికంగా, అనుచితంగా మాట్లాడితే మిగిలేది నువ్వొక్కడివే.. మాట అనే ఆయుధాన్ని పద్దతిగా వాడితే పైకోస్తావ్ - పద్ధతి తప్పి మాట్లాడితే అదే ఆయుధానికి నువ్వే బలైపోతావ్. అందుకే సభ్యత సంస్కారంతో మాట్లాడుతూ అందరిచేత గౌరవాన్ని అభిమానాన్ని అందుకుంటూ మనిషి అనే పదానికి సరైన అర్దాన్ని ఇవ్వు.
 

---- మీ అనిల్.


More Good Word Of The Day