నీచమైన ప్రాణులు అంతే

 

 

కృమి కుల చిత్తం లాలా క్లిన్నం విగంధి జుగుప్సితం

నిరుపమ రసం ప్రీత్యా ఖాదన్ఖరాస్థి నిరామిషమ్‌ ।

సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య న శంకతే

న హి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహ ఫల్గుతామ్‌ ॥

కుక్కకి ఒక ఎముక ముక్క దొరికితే చాలు- అందులో మాంసం లేకపోయినా, పురుగులు చేరి కంపుకొడుతున్నా, జుగుప్సాకరంగా ఉన్నా... మహా పారవశ్యంతో దాన్ని నాకుతూ ఉంటుంది. ఆ సమయంలో దాని ఎదుట ఇంద్రుడే ప్రత్యక్షమైనా సిగ్గుపడదు. నీచప్రాణులు ఎప్పుడూ అంతే! తాము స్వీకరించే పదార్థం ఎలాంటిది అన్న పట్టింపు వాటికి ఉండదు. నీచ మానవుల వ్యక్తిత్వం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పడం శతకకారుని ఉద్దేశంగా కనిపిస్తుంది.


More Good Word Of The Day