కర్మ ప్రభావం

 

 

బ్రహ్మా యేన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే

విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహా సంకటే ।

రుద్రో యేన కపాల పాణి పుటకే భిక్షాటనం సేవతే

సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే ॥

సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృజించే కార్యంలో నిమగ్నమైపోయి ఉన్నాడు, విష్ణుమూర్తి దుష్టశిక్షణ కోసం నానా కష్టాలనూ ఎదుర్కొని దశావతారాలను ఎత్తాడు, శివుడు కపాలాన్ని చేతపట్టి భిక్షాటన చేస్తున్నాడు, ఇక సూర్యుడేమో ఆకాశంలో అటూఇటూ తిరుగుతున్నాడు. ఇంతటి దేవతలు కూడా అంతటి పనిలో పడ్డారంటే అదంతా కర్మ ప్రభావమే కదా!


More Good Word Of The Day