ఉత్తరాయణ పుణ్య కాలం

 


ఆరోగ్యం అందించే పండుగ
హిందువుల తొలి  పండుగ
తొలి ఏకాదశి  మనపండుగ
 ఈ కాలంలో వాతావరణంలో మార్పులు   సంభవిస్తాయి .. ఆరోగ్య రక్షణా నియమాలు ఆచరించాలి..
ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.  ఎండా కాలం ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం..  శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున   పేలాల పిండిని  దేవునికి ప్రసాదంగా పెడతారు.

ఏకాదశి కన్య కథ  : కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షస సంహారం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. 

ఏకాదశి నాడు ఏం చేయాలి: ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి..    ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది  కేశ వుని అనుగ్రహం లభిస్తుంది.


More Toli Ekadasi