సుఖంలో ఒకలాగా... కష్టంలో ఒకలాగా

సంపత్సు మహతాం చిత్తం భవే దుత్పలకోమలమ్‌ ।
ఆపత్సు చ మహాశైల శిలా సంఫూత కర్కశమ్‌ ॥

 

ధనకనక వస్తువాహనాల పట్ల మహాత్ముల తీరు కలువలాగా మెత్తగా ఉంటుంది. కానీ ఆపద సమయాలలో వారు కఠినమైన శిలలాగా నిలుస్తారు. అంటే సంపదలు వచ్చినప్పుడు వారి మనసులోని కారుణ్యం ఏమాత్రం తగ్గదు సరికదా... వారి సున్నిత స్వభావంలో ఏ మార్పూ రాదు. అదే ఆపదలు ఏర్పడినప్పుడు, వాటని ఎదుర్కొనేందుకు దృఢ సంకల్పంతో ఎదురు నిలుస్తారు.

--నిర్జర


More Good Word Of The Day