యుక్తితోనే జయం

 

 

రత్నమాల పుట్ట రంధ్రాన పడవైచి

కాకి త్రాచుపాము గర్వ మడచె

పరుల నిట్లు యుక్తిపరులు సాధింతురు

లలితసుగుణజాల! తెలుగుబాల!!ఒక కాకి గూడు కట్టుకున్న చెట్టు కిందే ఓ పాము కూడా నివాసం ఉండేది. చెట్టు మీద ఉన్న కాకి గుడ్లు పెట్టగానే, కింద ఉండే పాము వాటిని గుటుక్కుమనిపించేది. తనకంటే బలవంతురాలైనా పాము మీద ఆ కాకి ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంది. వెంటనే రాణిగారి హారాన్ని ఎత్తుకు వచ్చింది. అందరూ చూస్తుండగా రాణిగారి హారాన్ని తీసుకుని కాకి బయల్దేరడంతో, సైనికులు కూడా దానిని వెంబడించారు. ఆ కాకి అటు తిరిగీ ఇటు తిరిగీ చివరకి ఆ హారాన్ని పాము ఉండే పుట్టలో పడేసింది. అంతే! ఆ హారం కోసం సైనికులు పుట్టని తవ్వి పారేశారు. పుట్ట నుంచి బయటకు వచ్చిన పాముని చంపేశారు. తమ శత్రువుని యుక్తిపరులు ఇలా తెలివిగా ఎదుర్కొంటారంటున్నాడు శతకకారుడు.

 

 


More Good Word Of The Day