శ్రీలక్ష్మీ ఫలంతో సిరి సంపదలు

 

Information on experience about goddess lakshmi palam siri sampadalu

 

శ్రీలక్ష్మీ ఫలం అంటే చాలామందికి తెలీదు. ఇది పెద్ద ఉసిరికాయ సైజులో ఉంటుంది. ఆకారంలో కొబ్బరికాయను పోలి ఉంటుంది. రంగు మాత్రం బూడిదరంగు. ఆకృతిలో చిన్నగా ఉన్నప్పటికీ, శ్రీలక్ష్మీ ఫలానికి కొబ్బరికాయ మాదిరిగానే పీచు ఉంటుంది. నారికేళానికి ఉన్నట్టే కళ్ళు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం కళ్ళను "బిరుదులు" అంటారు. శ్రీలక్ష్మీ ఫలాలు సముద్ర తీరప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. శ్రీలక్ష్మీ ఫలం సేకరించి, ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే. శ్రీ మహాలక్ష్మి పుట్టింది సాగరంలో. శ్రీలక్ష్మీ ఫలాలు అంకురించేదీ సముద్రంలోనే. లక్ష్మీదేవికీ, శ్రీలక్ష్మీ ఫలాలకూ అవినాభావ సంబంధం ఉంది. వీటిని పూజామందిరంలో ఉంచుకుంటే సర్వ శుభాలూ చేకూరుతాయి. సిరిసంపదలకు కొదవ ఉండదు.

 

Information on experience about goddess lakshmi palam siri sampadalu

 

శ్రీలక్ష్మీ ఫలాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడో ఒకప్పుడు పూజించకూడదు. గురువారం లేదా ఏదైనా పర్వదినం రోజున మొదలుపెట్టాలి. శ్రీలక్ష్మీ ఫలంతో పూజ మొదలుపెట్టే రోజున పొద్దున్నే లేచి, స్నానపానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీలక్ష్మీ ఫలాన్ని "శుద్ధోదక జలంతో కడగాలి. పూజకు కేటాయించిన పీటను శుభ్రపరిచి పసుపు రాయాలి. దానిమీద కొత్త వస్త్రం పరిచి దానిమీద శ్రీలక్ష్మీ ఫలాన్ని ఉంచాలి. దానికి చందనం అద్ది, కుంకుమబొట్టు పెట్టాలి. కొన్ని నాణాలు, అక్షింతలు, కొద్దిగా పసుపు, కుంకుమ, కర్పూరం శ్రీలక్ష్మీ ఫలం ముందు ఉంచాలి. పైన చెప్పిన ప్రకారం శ్రీలక్ష్మీ ఫలాన్ని పూజామందిరంలో పీఠం మీద ప్రతిష్ఠించి, అక్షింతలు, నాణాలు ఉంచిన తర్వాత "ఓం శ్రీం శ్రియై నమః" అంటూ పూజించాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకొనేవారికి సులభమైన మార్గం శ్రీలక్ష్మీఫలం పూజ.శ్రీలక్ష్మీ ఫలం తంత్ర శక్తులలో చాలా మహిమాన్వితమైనది.శ్రీలక్ష్మీ ఫలం ఎవరి దగ్గర ఉంటే వారిదగ్గరకు లక్ష్మీ తనంతట తానుగా వస్తుందని అంటారు.

 

Information on experience about goddess lakshmi palam siri sampadalu

 

ఉపయోగాలు:-

శ్రీలక్ష్మీ ఫలం తాంత్రిక ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
శ్రీ లక్ష్మీ ఫలాన్ని నిత్యం పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
శ్రీ లక్ష్మీ ఫలాన్ని వ్యాపారస్ధలంలోను, ఆపీసుల్లో ఉంచిన సత్వర ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.
శ్రీలక్ష్మీ ఫలాన్ని పూజచేసుకొని దగ్గర ఉంచుకొనేవారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వవు.
శ్రీలక్ష్మీ ఫలాన్ని వ్యవసాయం చేసే వారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయి.
శ్రీ లక్ష్మీ ఫలంతో పాటు ఎల్లప్పుడు నాణేలను ఉంచాలి.


More Lakshmi Devi