నిర్జల ఏకాదశి 

 

 

పచ్చి మంచినీరు సైతం ముట్టకుండా సాగే ఈ ఏకాదశి..  మిగతా ఏకాదశులు అన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.

అన్ని ఏకాదశి ఉపవాసాల మాదిరి గానే ఈ నిర్జల ఏకాదశి కూడా సాగుతుంది.

దశమి నాడు ఒంటిపూట భోజనం;

దశమినాటి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆచరించడం; 

నిర్జల ఏకాదశినాడు ఆచమనానికి తప్ప చుక్క నీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని సాగించడం; 

ఏకాదశినాడు విష్ణుమూర్తిని దర్శించి, సేవించి,పూజించుకోవడం; 

ఏకాదశి రాత్రివేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయడం;

ద్వాదశి నాడు ఒక అతిథిని భోక్తగా పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం....

శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.

ఇలా సాగుతుంది ఈ నిర్జల ఏకాదశి.

హరినామ స్మరణం-సమస్తపాపహరణం

జై శ్రీమన్నారాయణ


More Festivals