మార్గశిర మాస విశిష్టత

మాసానాం మార్గశీర్షోహం – అన్నారు జగద్గురువు *శ్రీకృష్ణ పరమాత్మ*. 

లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే. తొలిరోజు కార్తీకమాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలుటతో ప్రారంభమవుతుంది. 

 ప్రతీరోజూ శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం.

మార్గశిర శుద్ధ తదియ నాడు *ఉమామహేశ్వర వ్రతం* చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది.

అలాగే *మార్గశిర శుద్ధ పంచమి* నాడు ‘నాగపంచమి’ చేసే ఆచారం కూడా ఉంది.  

 *మార్గశిర శుద్ధషష్ఠి* *సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం*.  

*మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం*. దీనినే *కాలభైరవాష్టమి* అంటారు. 

*మార్గశిర శుద్ధేకాదశి శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి,* సౌఖ్యద ఏకాదశి అంటారు. 

మార్గశిర శుద్ధ ద్వాదశిని *మత్స్య ద్వాదశి*  అంటారు.

మార్గశిర శుద్ధపూర్ణ *శ్రీ దత్తజయంతి*. దీనినే కోరలపూర్నిమ, *నరక పూర్ణిమ* అంటారు. 

 *మార్గాశిరమాసంలో వచ్చే లక్ష్మివారం(గురువారం) నాడు* లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం. 

 *మార్గశిరమాసంలోనే* విష్ణువుకి ప్రీతికరమైన *ధనుర్మాసం* ప్రారంభమవుతుంది.


More Festivals