పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు..

వినాయకుడు బ్రహ్మచారే కావచ్చు... కానీ ఏ పెళ్లిని తలపెట్టినా, అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు. ఇక్కడి మూలవిరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం... ఇంకా మరిన్ని విశేషాలు కోసం ఈ వీడియోను చూడండి... https://www.youtube.com/watch?v=-UFAz0o6iQE

 

 


More Punya Kshetralu