పైకి తెలియనివ్వకు!
ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబు దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నబడెడు మాడ్కిదిరుగు మెలమి కుమారా! (కుమార శతకం)
జీవితంలో కలిమి ఉండవచ్చు, కష్టమూ ఉండవచ్చు. కానీ నీ పరిస్థితి ఏమిటో ఇతరులకు తెలియనివ్వకు. ఆ రహస్యాన్ని నీలోనే ఉంచుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల కీర్తిప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా నడుచుకో.
..Nirjara