పదోవరోజు పారాయణము

ఎకోనవింశాధ్యాయము

 

 

 

జ్ఞానసిద్ధ ఉవాచ : వేదవేత్తల చేత __ వేదవేద్యునిగానూ, వేదాంత స్థితునిగానూ, రహస్యమైన వానిగానూ, అద్వితీయునిగానూ కీర్తింపబడేవాడా!  సూర్యచంద్రశివబ్రహ్మాదుల చేతా __ మాహారాజాధి రాజుల చేతా సుత్తింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా! నీకు నమస్కారము. పంచభూతాలూ, సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలూ కూడా నీ విభూతులే అయి వున్నాయి. శివసేవిత చరణా! నువ్వు పరమము  కంటేను పరముడవు . నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమరూపమైనా సమస్త ప్రపంచమూ  కూడా __ దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్పుటమవుతోంది. సృష్ట్యాదీనీ, మధ్యలోనూ, తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి వుంటావు. భక్ష్య, భోజ్యా, చోష్య, లేహ్య రూప చతుర్విథాన్న రూపుదావూ, యజ్ఞ స్వరూపుడవూ కూడా నీవే. అమృతమయమూ, పరమ సుఖప్రదమూ అయిన నీ సచ్చిదానందరూప సంస్మరణ మాత్రము చేతనే __ ఈ సంసారము సమస్తమూ 'వెన్నెట్లో సముద్రములా' భాసిస్తోంది. హే అనందసాగరా! ఈశ్వరా! జ్ఞాన స్వరూపా! సమస్తానికీ ఆధారమూ, సకల పురాణసారమూ కూడా నీవే అయి వున్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి __ తిరిగి  నీ యందే లయిస్తూ వుంది. ప్రాణులందరి హరుడయలలోనూ వుందే వాడినీ, ఆత్మవాచ్యుడవూ, అఖిలవంధ్యుడువు. మనోవాగ గోచరుడవూ అయిన నువ్వు కేవలము మాంసమయాలైన బౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రీ ! ఓ కృష్ణా! ఈశ్వరా! నారాయణా! నీకు నమస్కారము.

 

Sampoorna Karthika Maha Purananamu 10th Day Parayanam

 

నీ యీ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చెయ్యి . దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన __ నా జన్మకు సాఫల్యాన్నను గ్రహించు దాతవు. నేతవు, కృపాసముద్రడవూ __ అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధ చరితా! ముకుందా! త్రిలోకనాథా! త్రిలోకవాసీ! అనంతా! అదికారణా! పరమాత్మా! పరమహంసవతీ! పూర్ణాత్మా! గుణాతీతా ! గురూ! దయామయా విష్ణో! నీకు నమస్కారము. నిత్యానందసుదాబ్దీ వాసీ! స్వర్గాపవర్గ ప్రదా! అభేదా! తేజోమయా! సాధు హృత్పద్మస్థితా! అత్మారామా! దేవదేవేశా! గోవిందా! నీకిదే నమస్కారము. సృష్టి స్థితి లయకరా! వైకుంఠవాసా! బుద్ధిమంతులైన వారు పాదాలయందలి భక్తియనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో, అటువంటి తెజస్స్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రమాణాలు. వేదాల చేత గాని, శాస్రతర్క పురాణ నీటి కావ్యాదుల చేతగాని __ మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి  అనే అమ్జనాలను ధరించా గలిగిన వాళ్ళు మాత్రమే __ నీ రూపాన్ని భావించాగలిగి, ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కేండేయ, విభీషణ, ఉద్దవ, గంజే౦ద్రాది భక్తకొటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలూ నశించి పోతున్నాయి.

 

Sampoorna Karthika Maha Purananamu 10th Day Parayanam

 

ఓ కేశవా! నారాయాణ! గోవిందా! విష్ణూ! మధుసూదనా! త్రివిక్రమా! వామనా! శ్రీధరా! హృషీకేశా! పద్మనాభా! దామోదరా! సంకర్షణా! వాసుదేవా! నీకు నమస్కారము. నన్ను రక్షించు.ఈ విధంగా తెరపిలేనిపారవశ్యంతో తనను సుత్తిస్తున్న జ్ఞానసిద్దుణ్నీ చిరునవ్వుతో చూస్తూ "జ్ఞానసిద్దా! నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో' అన్నాడు విష్ణుమూర్తి . 'హే జగన్నాథా ! నీకు నాయందు అనుగ్రహమే వున్నట్లయితే, నాకు సాలోక్యాన్ని (వైకుంఠం) ప్రసాదించు ' మని కోరాడు. జ్ఞాసిద్ధుడు. "తథాస్తు" అని దీవించి __ తార్ క్ష్య వాహనుడైన శ్రీహరి యిలా చెప్పసాగాడు. 'జ్ఞానసిద్దా! నీ కోరిక నేరవేరుతుంది. కాని. అత్యంత దురాత్ములతో నిండిపోతూన్న ఈ నరకములో  _ మహాపాపాత్ముల సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురషా! నేను ప్రతీ ఆషాడశుద్ధ దశిమినాడూ, లక్ష్మీసమేతుడనై పాలసముద్రములో పవళించి కార్తీకశుద్ధ ద్వాదశినాడు మేల్కోంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలూ __ ఎవరైతే సద్ర్యతాలనాచరిస్తారో, వారు విగతపావులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులూ, వైష్ణవులూ అయిన నీవూ, నీ  సహవ్రతలూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతిక ఫలానని పొందుతారని తెలుసుకోండి,. నిజానికి నాకు నిద్ర __ మేలుకోవ కల __ అనే అవస్థాత్రయ మేదీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా ణా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూంటానని గుర్తించు. చాటుర్మాస్యాన్నే కాకుండా __ నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందూ పఠించే వాళ్ళు కూడా తరుస్తారు. వీటిని లోకంలో _ ప్రచారం చేసి __ లోకోపకారానికి నడుం కట్టు ' ఈ విధంగా చెప్పి, ఆదినారాయణుడు లక్ష్మీసమేతుడై _ ఆషాడశుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు.   

 

Sampoorna Karthika Maha Purananamu 10th Day Parayanam

 

  
అంగీరస ఉవాచ : ఓయీ! నీవడిగిన చాతుర్యస్మ వ్రతమహిమ  ఇది. దురాత్ములైనా- పాపులైనా సరే - హరిపరాయణులై  యీ చాతుర్యస్మ వ్రతచరన చేసే బ్రాహ్మణా, వైశ్య క్షత్రియ, శూద్ర, స్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్రహత్యా ఫలాన్నీ, కోటిజన్మలు సురాపానము చేసిన పాపాన్నీ పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు __ వంద యజ్ఞాలు చేసిన ఫాలాన్నీ, అ౦త్యంలో విష్ణులోకాన్నీ పొందుతారు.

ఏకోన వింశోధ్యాయ స్సమాప్తః (పందోమ్మివఅధ్యాయము)


వింశాధ్యాయము

 

Sampoorna Karthika Maha Purananamu 10th Day Parayanam

 

జనకుని కోరికపై వశిష్టుడు __ ఇంకా యిలా చెప్పసాగాడు: ఓ మిధిలారాజ్య ధౌరేయా! ఈ కార్తీక మాహత్మ్యమును గురించి అత్ర్యగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిమహముని, అగస్యుని చూసి, 'కుంభసంభవా! లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్మ్యబోధకమైన ఒకానొక హరిగాధను వినిపిస్తాను __ విను. వేదముతావు సమానమైన శాత్రము గాని, ఆరోగ్యానికి యీడైన అనందముగని. హరికి సాటియైన దైవముగాని, కర్తీకముతో సమానమైన నేలకాని లేవయ్యా! కార్తీక స్నాన, దీపదానాలూ విష్ణ్వర్చనల వలన సమస్త వాంఛలూ  సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమె విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్ఠాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహస్యాన్ని చెబుతాను.

పురంజయోపాఖ్యానము 

 

Sampoorna Karthika Maha Purananamu 10th Day Parayanam

 

త్రేతాయుగంలో, సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడూ అయిన ఆ రాజు __ అత్యధికమైన ఐశ్వర్యము కలగడంలో అహంకరించినవాడై __ బ్రాహ్మణ , ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ వీహీనుడూ, దుష్టపరాక్రమయుక్తుడూ, దుర్మార్గవర్తనుడూ అయి ప్రవర్తింపసాగాడు.. తద్వారా అతని ధర్మబలము నశించడంతో, సామంతులైన కాంభోజ కురుజాదులనేక మంది యేకమై __ చతురంగ బలలాతో వచ్చి _ అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బాలమదయుక్తుడై __ శత్రువులతో  తలపడెందుకు సిద్దమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నదీ, ప్రకాశించేదీ, జెండాతో అలంకరించబడినదీ, ధనుర్భాణాదిక శాస్రాస్త్రాలతో సంపన్నమైనదీ, అనేక యుద్దాలతో విజయం సాధించినది. చక్కటిగుర్రాలు పూన్చినదీ, తమ సూర్యవంశాన్వయమైనదీ అయిన రధాన్నదిరోహించి __ రధగజతురగపదాతులు __ అనబడే నాలుగు రకాల బలముతో __ నగరము నుండి వెలువడి __ చుట్టుముట్టిన శత్రుసైన్యములపై విరుచుకుపడ్డాడు.  


ఏవం శ్రీస్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యే

ఏకోనవిశంతి, విశంతి అధ్యాయౌ, (పందోమ్మిది __ ఇరవై అధ్యాయములు

 

Sampoorna Karthika Maha Purananamu 10th Day Parayanam

 

10 వ రోజు


నిషిద్ధములు :- గుమ్మడికాయ, నూనె, ఉసిరి

దానములు :- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె

పూజించాల్సిన దైవము :- దిగ్గజాలు

జపించాల్సిన మంత్రము :- ఓం మహామదేభాయ స్వాహా

ఫలితము :- యశస్సు - ధనలబ్ధి 


పదియవ (దశమ దిన ) నాటి పారాయణము సమాప్తము.   

  


More Kartika Maha Puranam