నవంబర్ 7న ఇలా చేస్తే చాలామంచిది...!

 


పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దిని సంకటహర చతుర్ధి అంటారు. ఆ రోజున వినాయకుడ్ని.. వినాయకచవితి నాడు పూజించే రీతిలో పూజిస్తే.. కష్టాలన్నీ తొలిగిపోతాయ్. ముఖ్యంగా కార్తీకమాసం వచ్చే సంకటహర చతుర్ధి అయితే.. ఇంకా ఫలప్రదం. కార్తీక మాసం అంటే.. శివుడికి ఇష్టం. ఆయన కొడుకు కాబట్టి... గణపతికి కూడా ఇష్టం. అందుకే.. ఆ రోజున చంద్రుడు ఉదయించే సమయాన గరికతో స్వామిని పూజిస్తే.. ఆయన ఇంటికి శుభాన్ని చేకూరుస్తాడు.

గణేశుడు అగ్నితత్వం ఉన్న దైవం. అందుకే.. ఆయన గరికతో పూజిస్తే చల్ల బడతాడు. గణపతిని పూజించిన గరికలో కొంత తీసుకొని దిండుకింద పెట్టుకని పడుకుంటే.. భర్తకు ఆయురారోగ్యాలు సొంతం అవుతాయ్. వ్యాధులుంటే అవి కూడా సమసిపోతాయ్. నిద్రలో దడుచుకొని లేచే పిల్లలు ఇంట్లో ఉంటే.. ఈ గరికను వారి దిండుకింద పెట్టండి. మరోసారి వారికి అలాంటి పరిస్థితి రాదు. తాంత్రికులు కూడా ఈనాడు గణేశుడ్ని పూజిస్తారు.  ఈ దఫా కార్తీకమాసం వచ్చిన సంకటహర చతుర్ది.. నవంబర్ న మంగళవారం వచ్చింది. ఇది ఇంకా శుభకరం. ఇంకా ఈ రోజు పాటించాల్సిన నియమ నింబధనల గురించి తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి. 

 

 


More Karthikamasa Vaibhavam