ఈ కార్తీకంలో నీటితో అభిషేకం తప్పక చేయాలి !

శివుడు అభిషేక ప్రియుడు. ముఖ్యంగా కార్తీకమాసంలో అయితే.. శివాలయాలు కళకళ లాడిపోతుంటాయ్ అనడం కంటే జలజలలాడిపోతుంటాయ్ అనడం సబబు. నిత్య అభిషేకాలతో శివయ్య కృపకటాక్షాలకోసం తపిస్తుంటారు మానవులంతా. అయితే... చాలామందికి అభిషేక రహస్యం తెలీదు. అభిషేకం.. నమక, చమకాలతో చేయాలి. ‘నమకం’ అంటే.. సమస్త బ్రహ్మందంలో శివుడ్ని చూడటం.. శక్తి నుంచి ఉద్భవించే శివుడ్ని మంత్రం ద్వారా స్తుతించడం. ‘చమకం’ అంటే.. మనకు కావాల్సింది శివయ్యను అడగడం. అలా అభిషేకం చేస్తే శివుడు తప్పక ఆనందిస్తాడు. ఆయన్ను పంచామృతాలతో అభిషేకించనవసరం లేదు. చెంబుడు నీళ్లు పోసిన మాత్రం చేతనే పరవశించి వరాలిస్తాడు శివుడు. అందుకే ఆయన భోళా శంకరుడు. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి............

 

 


More Karthikamasa Vaibhavam