నవంబరు 14 ఎంత ముఖ్యమో మీకు తెలుసా...

కార్తీక ఏకాదశి.. కార్తీక మాసంలో పరమపవిత్రమైన రోజు. మనందరికీ ఏకాదశి అంటే.. అదొక తిథిగానే తెలుసు. కానీ.. ఏకాదశి తిథి మాత్రమే కాదు.. అదొక దేవత. పూర్వం దేవతలందరినీ ఓడించిన మురాసురుడ్నీ తానే స్వయంగా సంహరించడానికి మహావిష్ణు సిద్ధపడ్డాడు. వారిద్దరి మధ్య వందల ఏళ్లు ఘోరమైన సంగ్రామం జరిగింది . ఆ సంగ్రామంలో అలసిన విష్ణువు.. ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండాగా.. మురాసుడు దొంగచాటుగా వచ్చి.. నిద్రలో ఉన్న మహావిష్ణువుపై ఆయుధ ప్రయోగం చేయబోతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుని నుంచి ఓ దేవత ఉద్భవించి మురాసురుడ్ని సంహరిస్తుంది. ఆ దేవత పేరే ఏకాదశి. అప్పుడు శ్రీ మహావిష్ణువు.. ఏకాదశి రోజున ఎవరు ఉపవాస దీక్షను చేస్తారో... జాగారం ఉంటారో వాళ్లకు సకల సిద్ధులూ లభిస్తాయని వరం ఇస్తాడు. అందుకే.. ఏకాదశి పవిత్రం. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశి పరమపవిత్రం. ఈ ఏడాది కార్తీక ఏకాదశి ఈ నెల 14న వచ్చింది. ఇంకా వివరాలు కావాలంటే.. ఈ వీడియో ఓ సారి క్లిక్ చేయండి.

 


More Karthikamasa Vaibhavam