మూర్ఖుని మార్చలేము

 

 

వ్యాళం బాల మృణాల తంతుభిరసౌ రోద్ధుం సముజ్జృంభతే

భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమ ప్రాంతేన సన్నహ్యతి ।

మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధే రీహతే

మూర్ఖాన్యః ప్రతినేతు మిచ్ఛతి బలాత్సూక్తైః సుధా స్యందిభిః ॥

తామరతూటి దారాలతో మదపుటేనుగులని బంధించే ప్రయత్నం, పూల కొసలతో వజ్రాన్ని సానబెట్టాలనుకునే ప్రయత్నం, ఒక్క తేనెబొట్టుతో సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకునే ప్రయత్నం ఎంత వృధానో.... మూర్ఖుని మనసుని మంచి మాటలతో మార్చాలనుకోవడం అంతే అసాధ్యం.


More Good Word Of The Day