సింహద్వారం - ముఖ్యమైన జాగ్రత్తలు

Main Door Vastu Rules

 

సింహద్వారం చాలా ముఖ్యమైంది. కనుక ఇంటి ప్రధాన ద్వారానికి సంబంధించి కొన్ని సూత్రాలను తప్పనిసరిగా అమలుపరచాలి. వాస్తు నియమాన్ని అనుసరించి ఇంటి ప్రధాన ద్వారం ఉచ్ఛంలో ఉండాలి.

 

ఉచ్ఛ స్థానాల్లో ఉండాల్సిన ద్వారాలు

తూర్పు ఈశాన్యం నుండి తూర్పు మధ్య వరకు

పశ్చిమ వాయువ్యం నుండి పశ్చిమ మధ్య వరకు

ఉత్తర ఈశాన్యం నుండి ఉత్తరం మధ్య వరకు

దక్షిణ ఆగ్నేయం నుండి దక్షిణ మధ్య వరకు

 

సింహద్వారం కనుక ఈశాన్యంలో లేనట్లయితే అటువైపు తప్పనిసరిగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయాలి.తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిక్కుల్లో ద్వారాలు ఉండటం మంచిది.

 

చాలామంది తూర్పు, పశ్చిమ ఇలా ఏ దిక్కునైనా కావచ్చు ఆ గోడకు మధ్యలో ద్వారం ఏర్పాటు చేసుకోవడం అలవాటుగా మారింది. ఎక్కువమంది సింహ ద్వారాన్ని అలా మధ్యలో పెట్టించుకుంటున్నారు కనుక అదే సరైనది అనే అభిప్రాయం స్థిరపడింది. నిజానికి ఆయా దిక్కుల్లో మూలల్లో ద్వారాలు ఉండటమే శ్రేయస్కరం. ద్వారబంధం మధ్యలో ఉంటే దోషం ఏమీ ఉండదు కానీ మూలలో ఉంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇది వాస్తు రీత్యా మంచిది కూడా.


indian vastu rules and regulations, front door and vastu, vastu implimentations to doors, main door vastu conditions, main door in east side, west side main door, importance of vastu in doors


More Vastu