వాస్తులో రంగులకూ ప్రాధాన్యత ఉంది...

Vastu and Colours

 

వాస్తులో ఏ గది ఎక్కడ ఉండాలి.. ఎటువైపు ఎంత స్థలం మిగులు ఉండాలి.. గేటు ఎటువైపు ఉంటే మంచిది.. ద్వారాలు ఎటువైపు ఉంటే మంచిది, కిటికీలు, ద్వారబంధాలు ఎన్ని ఉండాలి.. మొదలైన నియమాలు, నిబంధనల తోబాటు రంగుల విషయంలోనూ కొన్ని సూత్రీకరణలు చేశారు.

 

వాస్తు శాస్త్రంలో ఇంటికి వేసే రంగులకూ ప్రాధాన్యత ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఇళ్ళకు తెలుపు రంగును మించింది లేదు. తెలుపు సర్వత్రా శ్రేష్టం. తెలుపు త్వరగా మాసిపోతుంది కనుక కొందరికి ఇష్టం ఉండదు.

 

ఇళ్ళకు తెలుపు, గోధుమరంగు, చాక్లెట్ రంగు, లేత నీలం రంగు, లేత ఆకుపచ్చ రంగులను ఉపయోగించడం మంచిది. ఇవి చూడగానే హాయిగా అనిపిస్తాయి. మనసును ఆకట్టుకుంటాయి.

 

షాపులు, వ్యాపార సంస్థలకు లేత ఆకుపచ్చ, లేత పసుపు, గులాబి, గోధుమ రంగు వేయడం మంచిది.

 

ఇళ్ళు, వ్యాపార సంస్థలు రెంటికీ కూడా నలుపు, బూడిద రంగులు ఉపయోగించకూడదు.

 

కొందరు కొత్తగా నిర్మించిన ఇంటికి సున్నం వేయకుండానే గృహప్రవేశం చేసి, అందులో నివాసం ఉంటారు. కానీ ఇలా చేయడం శుభప్రదం కాదు. ఇంటికి రంగులు వేసిన తర్వాతనే ఇంట్లోకి వెళ్ళాలి.

 

మరికొందరు కొత్త ఇంటికి తెల్ల సున్నం లేదా ఇతర రంగులు వేయిస్తారు కానీ ఇక తర్వాత పట్టించుకోరు. నిజానికి ఎప్పటికప్పుడు ఇంటికి సున్నం వేయిస్తూ ఉండాలి. కనీసం నాలుగేళ్ళకు ఒకసారి అయినా రంగులు వేయించాలి.

 

ఇంటికి తరచుగా సున్నం వేయించకపోతే కుటుంబసభ్యుల ఆరోగ్యం పాడవుతుంది. ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. ఆదాయం పరంగా ఇబ్బందులు ఎదురౌతాయి. చేపట్టిన పని కలిసిరాదు.

 

ఇళ్ళకే కాకుండా షాపులు, వ్యాపార సంస్థలకు తరచూ సున్నం వేయిస్తూ ఉండాలి. కనీసం ప్రతి రెండేళ్ళకూ రంగులు వేయించాలి. లేకుంటే ఆర్ధిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

 

Importance of colours in Vastu, house colours reflects on vastu, colours influence on Vastu, Indian vastu and colours on walls, colours inside and outside of the house


More Vastu