ఆశని వదులుకోవద్దు

 

భగ్నాశస్య కరండ పిండిత తనోర్మ్లానేంద్రియస్య క్షుధా

కృత్వాఖుర్వివరం స్వయం నిపతితో నక్తం ముఖే భోగినః ।

తృప్తస్తత్పిశితేన సత్వరమసౌ తేనైవ యాతః పథా

స్వస్థా స్తిష్ఠత దైవమేవ హి పరం వృద్ధౌ క్షయే కారణమ్‌॥

జీవితం అన్నాక కష్టసుఖాలు సహజం. ఈ విషయాన్ని గ్రహించి ఆశావహ దృక్పధంతో ఉంటే కాలం అనూహ్యంగా కలిసిరావడాన్ని గమనించవచ్చు. ఇందుకోసం ఒక ఉదాహరణ చెబుతున్నాడు శతకకారుడు. పాములవాడు ఒక పాముని పట్టుకుని దాన్ని వెదురుబుట్టలో ఉంచాడట. ఆ బుట్టలో ఉన్న పాము ఆకలిదప్పులతో డస్సిపోయింది. తనకిక విముక్తి లేదని కుంగిపోయింది. అలాంట సమయంలో ఓ రాత్రిపూట.... బుట్టలో ఏదన్నా ఆహారం ఉందేమో అన్న అనుమానంతో ఒక ఎలుక ఆ బుట్టని కొరికి అందులోకి ప్రవేశించింది. ఇంకేముంది! పాముకి కడుపునిండుగా ఆహారమూ దొరికింది. ఎలుక చేసిన కన్నంలోకి బయటకు వెళ్లే మార్గమూ కనిపించింది.


More Good Word Of The Day