మీ కోరికలు తీరాలంటే భీష్మ ఏకాదశి రోజున ఇవి దానం చేస్తే చాలు మీ కోరికలన్నీ తీరుతాయి..

 

 

జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణవుకి ప్రీతికరమైన ఏకాదశి తిధిని తన పేరిట బహుమానంగా  పరమాత్మనుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి మూలపురుషుడైనవాడు భీష్ముడు. మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన క్రిష్ణుణ్ణే తన ధర్మవర్ణనంతోనూ తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకొని, యన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రివిష్ణుసహస్రనామాల్ని గానం చేసి మోక్షంపొందాడు భీష్ముడు. దక్షిణాయనంలో అంపశయ్యమీద పడినా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాక ఆగి ఇహలోకపు శిక్షని తనకు తానుగానే విధించుకొని, పరమాత్మ దర్శనమైన కారణంగా  తన తప్పులను పరమాత్మ మన్నించాడని గమనించి సంత్రుప్తితో జీవించి ఉండగనే మోక్షం పొందిన మహనీయుడు భీష్ముడు.

నిజానికి భీష్ముడు తనువు చాలించినది ఏకాదశినాడు కానే కాదు శోభక్రున్నామ సంవత్సరం మాఘమాసం శుద్ధపక్షం అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్నమని తెలుపుతూ నడినెత్తిమీద ప్రకాశిస్తూ ఉండగా పరమాత్మధ్యానంతో శరీరాన్ని విడిచి ప్రాణవాయువుని నిష్క్రమింపచేసేడు. కనుక అష్టమి, రోహిణి నక్షత్రం ఉన్నరోజు భీష్మాష్టమి అవుతుంది. తల్లిదండ్రులున్నవారు కూడా ఈ రోజున తర్పణాలు విడవవచ్చని శాస్త్రం చెబుతోంది. నిజానికి భీష్ముడు మోక్షం పొందింది ఆరోజే. ఐతే ఇలా ఉత్తమంగా మోక్షాన్ని పొందిన కారణంగా ఆయన పేరిట భీష్మఏకాదశి అని ఏర్పరచారు. కనక అష్టమికి రెండురోజుల తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అయింది. భీష్మ ఏకాదశి నాడు మీరు గనక ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వసౌఖ్యాలు  లభిస్తాయి....సర్వసుఖాలు కలిగిస్తాయి. ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తే....వారికి విజయాలు చేకూరుతాయి.. ఉదయాన్నే లేచి విష్ణువుని ఆరాధించాలి.

అంపశయనం మీద విష్ణువుని ఆరాధించటానికి  భీష్ముడినోట వచ్చినదే విష్ణుసహస్రనామం కనుక భీష్ముడు చెప్పిన విష్ణుసహస్రనామాన్ని ఉదయాన్నే నిద్రలేచి పారాయణంగా చేస్తే స్వామి అనుగ్రహం ఉంటుందిట. అటుకులు నైవేద్యంగా పెట్టాలి. అటుకులలో పటికబెల్లం కలిపి నివేదన చేసిన తర్వాత ఆవుపాలు కూడా నివేదన చేసి వచ్చిన విష్ణుసహస్రనామ పారాయణ సహచరులందరికీ వినియోగం చేయాలి. భగవతార్పణం అంటూ పారాయణం చేసుకుంటూ...ఆవుపాలు అటుకులు వారికివ్వాలి. ఇలా ఇవ్వటం వల్ల మీకు ఎన్నో సుఖాలు చేకూరుతాయి. అన్ని కోరికలూ తీరుతాయి. సర్వశుభాలు జరుగుతాయి.

విష్ణుసహస్రనామ పఠనం సత్యనారాయణవ్రతం రెండూ చేస్తే...
అన్ని ఫలితాలు సిద్ధిస్తాయి...

బీష్మ ఏకాదశి రోజు ఏం చేసుకోవాలో?
ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారుకద.
ఇక్కడితో ఈకార్యక్రమం సమాప్తం...
సర్వం శ్రీక్రిష్ణార్పణమస్తు...

..........శుభం............

- కుల శేఖర్


More Festivals