సంస్కృతి, సరదాల మేళవింపు గొబ్బెమ్మలు

Hindu Tradition: Gobbemmalu

ధనుర్మాసం ప్రారంభమైన రోజునుండి వాకిళ్ళలో రంగవల్లికలు తీర్చిదిద్ది, వాటిమధ్య గొబ్బెమ్మలు ఉంచడం ఆచారం. గొబ్బెమ్మలకు పసుపుకుంకుమలు పెట్టి, మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ ఆడిపాడతారు. కొందరు సాయంత్రం వేళ కూడా గొబ్బెమ్మలు పెడతారు. సాయంత్రంవేళ పెరట్లో దీపాలు వెలిగించి, గొబ్బెమ్మలు చేసి సందె ముగ్గుల మధ్య ఉంచుతారు. అందుకే వీటిని సందె గొబ్బెమ్మలు అంటారు.

వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, వాటికి రంగులు అద్దడం, మధ్యలో గొబ్బెమ్మలు, గొబ్బి ఆటపాటలు - ఇవన్నీ పిల్లలకు మరీ వినోదం. ముగ్గులు, గొబ్బెమ్మలు తొక్కవద్దంటూ చేసే హెచ్చరికలు, మరి ఎలా నడవాలి అంటూ ఇతర్ల ప్రశ్నలు కూడా తమాషాగా ఉంటాయి.

ధనుర్మాసం అంతా వాకిళ్ళలో ఉంచిన గొబ్బెమ్మలను ఎండబెట్టి కనుమ రోజున వాటిని పొయ్యికింద పెట్టి కాల్చేసి, ఆ మంటతో పాయసం వండి దేవునికి నివేదించడం ఆచారం. ఇదంతా సరదా పంచే సంబరం.

hindu ritual gobbemmalu, telugu festival makar sankranti and gobbemmalu, colourful festival pongal and gobbemmalu, dhanurmasam and gobbemmalu, gobbemmalu and kolams, makara sankranti kolams and gobbemmalu


More Sankranti