వినాశకాలం వస్తే!

 

బుద్ధౌ కలుషభూతాయాం వినాశే సముపస్థితే।
అనయో నయసంకాశో హృదయాన్నావసర్పతి॥

పోయేకాలం దగ్గరకి వస్తే బుద్ధి కాస్తా కలుషితం అయిపోతుందట. అప్పుడు చేయకూడని పనులు చేయాల్సినవిగానూ, చేయవలసిన పనులు కూడనవి కానూ కనిపిస్తాయట. అంతేకాదు! చేయకూడని పనిని చేపట్టేదాకా అది హృదయంలోనే తిష్ట వేసుకుని ఉండిపోతుంది. అందుకే పెద్దలు వినాశకాలే విపరీతబుద్ధి అన్నారు కదా!

 


More Good Word Of The Day