కాలం కలిసిరాకపోతే!

 

ఖర్వాటో దివసేశ్వరస్య కిరణైః సంతాడితో మస్తకే

వాంఛన్దేశమనాతపం విధి వశాత్తాలస్య మూలం గతః ।

తత్రాప్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః

ప్రాయో గచ్ఛతి యత్ర దైవహతక స్తత్రైవ యాంత్యాపదః ॥

బట్టతల ఉన్న ఓ బాటసారి దారినపోతుండగా... సూర్యుడి తీక్షణతకు అతని బుర్ర మాడిపోవడం మొదలుపెట్టిందట. ఆ వేడి నుంచి రక్షించుకుందామని ఓ తాటిచెట్టు కిందకి చేరుకున్నాడు బాటసారి. కానీ దురదృష్టం! ఆ తాటి చెట్టు మీద నుంచి ఒక కాయ రాలిపడి, అతని బుర్ర కాస్తా పగిలింది. కాలం బాగోలేనప్పుడు... దురదృష్టం ఇలాగే వెన్నాడుతూ ఉంటుందని శతకకారుని ఉద్దేశం.


More Good Word Of The Day