అధముడను

 

 

హరిపదభక్తి నింద్రియజయాన్వితుఁ డుత్తముఁడింద్రియంబులన్‌

మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారవశ్యుఁడై

పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా

దరమున నెట్లుకాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!

 

ఓ రామా! విష్ణుపాదముల మీద భక్తితో ఇంద్రియాల మీద అదుపుని సాధించినవాడు ఉత్తముడు. పైచేయి సాధించకపోయినా, కనీసం వాటిని నిగ్రహించే ప్రయత్నం చేసేవాడు మధ్యముడు. ఆ కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఇంద్రియాలకు లొంగిపోయేవాడు అధముడు. అలాంటి అధముడినైన నన్ను నువ్వెట్లా కాపాడతావో మరి!

 

...Nirjara


More Good Word Of The Day