పిసినారివాడికంటే...

 

 

కలిమిగల లోభికన్నను

విలసితమగు పేదమేలు వితరణియైనన్‌

చలిచెలమ మేలుకాదా!

కులనిధియంభోధికన్న గువ్వలచెన్నా!

పిసినిగొట్టువాడి దగ్గర ఎంత డబ్బున్నా ఎవరికీ ఉపయోగం ఉండదు. కానీ దానగుణం ఉన్న పేదవాడి దగ్గర ఒక్క రూపాయి అధికంగా ఉన్నా అది ఇతరులకి ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే... సముద్రంలో ఎంత నీరు ఉన్నా అవి మన దాహాన్ని తీర్చేలవు కదా! అదే చిన్న మంచినీటి చెలమలోని నీరు మాత్రం దాహార్తిని తీర్చగలుగుతాయి. వేమన, బద్దెన స్థాయిలో నీతి శతకాన్ని రచించిన గువ్వల చెన్నడి శతకంలోనిదీ పద్యం.

 

..Nirjara


More Good Word Of The Day