చందనపు చెట్టులాగా

 

 

మూలం భుజంగైః శిఖరం విహంగైః

శాఖాప్లవంగైః కుసుమాని భృంగైః

సంసేవ్యతే చందనపాదపోయం

పరోపకారాయ పరాం ప్రవృత్తిః

చందనపు చెట్టు కింద పాములు నివసిస్తూ ఉంటాయి. ఇక దాని పైభాగంలో పక్షులు, కొమ్మల మీద కోతులు, పూల మీద తుమ్మెదలు జీవిస్తుంటాయి. ఇన్నిరకాల జీవులు తనని ఆశ్రయించి నివసిస్తున్నా... పరోపకారమే లక్ష్యంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది చందనపు వృక్షం. పరోపకారుల జీవితమూ ఆ చందనపు వృక్షాన్నే తలపిస్తుంది.

 

..Nirjara


More Good Word Of The Day