బద్ధకించిన తుమ్మెదలా...

 

 

రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం

భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీః

ఇత్థం విచింతయతి కోశగతే ద్విరేఫే

హా హంత హంత నళినీం గజ ఉజ్జహార

 

ఒక తుమ్మెద ఉండేదట. ఆ తుమ్మెద ఒక రోజున తామర పువ్వులోని మకరందాన్ని తనవితీరా జుర్రుకుంటూ అందులోనే ఉండిపోయింది. ఇంతలో రాత్రివేళ అయ్యింది. తామరరెక్కలు నిదానంగా ముడుచుకోసాగాయి. అయినా కూడా తుమ్మెద చలించలేదు. ఈ రాత్రికి తామరపూవు ముడుచుకుపోతేనేం, నేను ఇందులోనే ఉండిపోయి తేనెని ఆస్వాదిస్తూ గడిపేస్తాను. మళ్లీ ఉదయం వేళ సూర్యకిరణాలకి పూవు విచ్చుకోగానే బయల్దేరతాను అనుకుని బద్ధకించింది. మహావృక్షాలను సైతం ఛేదించగల తుమ్మెద అలా సున్నితమైన తామరపూవులో తనంతట తానుగా బందీగా ఉండిపోయింది. కానీ ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన ఏనుగు ఆ తామరపూవుని పెరికి నోట కరుచుకుంది. ఆ తామరపూవుతో పాటుగా తుమ్మెద కూడా ఏనుగు ధాటికి నలిగిపోయింది. ఇది కేవలం తుమ్మెదకు దాపురించిన విధ కాదు. అనుకున్న పనిని తరువాత ఎప్పుడో చేద్దాంలే అని వాయిదాలు వేసే ప్రతి ఒక్కరికీ ఇలాంటి విధే వర్తిస్తుందని ఈ పద్యం తెలియచేస్తోంది.

 

..Nirjara


More Good Word Of The Day