మొసలి - మూర్ఖుడు

 

 

 

మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా

యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ

స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ

చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్

మొసలి నోటిలో ఉన్న మాణిక్యాన్నియినా పెకిలించవచ్చు. భీకరమైన అలలతో పోటెత్తి ఉన్న సముద్రాన్నయినా దాటవచ్చు. పాముని పూలదండలా మెడలో ధరించవచ్చు. కానీ మూర్ఖుని మనసుని మాత్రం మరల్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు!


More Good Word Of The Day