ఆడగకుండానే

పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్‌ ।
నాభ్యర్థితో జలధరో-పి జలం దదాతి
సంతః స్వయం పరహితే విహితాభియోగాః ॥
ఏ ప్రార్థనా లేకుండానే సూర్యుడు తామర కొలనును వికసింపచేస్తున్నాడు. ఎలాంటి అభ్యర్థనా చేయకుండానే చంద్రుడు కలువలకు జీవాన్నిస్తున్నాడు. అడగకుండానే మేఘుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. సత్పురుషుల నడవడి కూడా ఇలాగే ఉంటుంది. తమని ఎవరూ అడగకుండానే వారు ఇతరులకి హితం కలిగే పనులకు పూనుకుంటారు.

- నిర్జర.


More Good Word Of The Day