గవ్వలు ఇంట్లో ఇక్కడగానీ పెట్టారంటే డబ్బే డబ్బు

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం. గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉందనీ పండితులు చెబుతున్నారు. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది.

 

what are the benefits of Sea Shells relating to Goddess Lakshmi, Are Sea Shells reflex of Goddess Laxmi

శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు." అని ఉంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.​
 


గవ్వల వల్ల కలిగే ఉపయోగాలు :

what are the benefits of Sea Shells relating to Goddess Lakshmi, Are Sea Shells reflex of Goddess Laxmi

 

* పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కట్టాలి.

* కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.

* గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం  వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.

* గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.

* గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.

* వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.

* వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది. గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది కాబట్టి గవ్వలు కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు. 

* వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది. 

* గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే.


More Lakshmi Devi