కర్మ ఫలించేందుకు కాలం రావాలి

 

 

నైవాకృతిః ఫలతి నైవ కులం న శీలం

విద్యాపి నైవ న చ యత్న కృతాపి సేవా ।

భాగ్యాని పూర్వతపసా ఖలు సంచితాని

కాలే ఫలంతి పురుషస్య యథైవ వృక్షాః ॥

అందమైన రూపం కానీ, గొప్ప కులం కానీ, అద్భుతమైన వ్యక్తిత్వం కానీ, ఉన్నత విద్య కానీ, రాజసేవ కానీ ఒకోసారి ఎందుకూ కొరగాకుండా పోతాయి. పూర్వజన్మ సుకృతం మాత్రమే కర్మఫలితాన్ని శాసిస్తుంది. ఎలాగైతే చెట్లకి పండ్లు కాసేందుకు తగిన సమయం రావాలో... అలాగే కర్మ ఫలించేందుకు కూడా అందుకు తగిన కాలం రావాలి.


More Good Word Of The Day