మూర్ఖత్వానికి విరుగుడు

 

 

శక్యో వారయితుం జలేన హుతభుక్ఛత్రేణ సూర్యాతపో

నాగేంద్రో నిశితాంకుశేన సమదో దండేన గౌర్గర్దభః ।

వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మంత్ర ప్రయోగైర్విషం

సర్వస్యౌషధమస్తి శాస్త్ర విహితం మూర్ఖస్య నాస్త్యౌషధమ్‌ ॥ (భర్తృహరి నీతి శతకము)

 

నిప్పుని నివారించడానికి నీటిని, సూర్యుని తాపాన్ని ఎదుర్కోవడానికి గొడుగును, పాము వంటి జంతువుల విషానికి విరుగుడుగా మంత్రాలనూ, ఏనుగును అదుపు చేయడానికి అంకుశాన్నీ, గాడిద వంటి జంతువులను నిలువరించేందుకు కర్రనూ, వ్యాధులను తిప్పికొట్టేందుకు ఔషధాలనూ ఉపయోగించాలని శాస్త్రాలలో పేర్కొన్నారు. కానీ మూర్ఖత్వాన్ని నివారించే మందు ఏ శాస్త్రంలోనూ చెప్పలేకపోయారు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకూ ఒక ఉపాయమూ మందూ ఉన్నాయి కానీ మూర్ఖత్వాన్ని ఎదుర్కొనేందుకు ఏ విరుగుడూ లేదని అర్థం!

 

...Nirjara


More Good Word Of The Day