శాస్త్రాల ప్రకారం ప్రతి మనిషి ఐదు రకాల రుణాల నుంచి విముక్తి పొందాలి. అవి దేవఋణం, పితృఋణం,మనుష్యఋణం,ఋషిఋణం, భూతఋణం. మనకి రక్త మాంసాలు పంచి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అయితే పితృ తర్పణాలు, పిండొదక దానాలు, శ్రాద్ద కర్మలు ఆచరించడం ద్వారా మన పెద్దల ఋణం కొంతైనా తీరుతుందని శాస్త్ర ఉవాచ. మకర సంక్రాంతి నాడు నువ్వుల పిండిని నలుగు పెట్టుకుని ఒంటికి రాసుకుని స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలాలని చెబుతారు.

 


More Sankranti