పరాజయం తప్పదు

 

 

స్థానము తప్పివచ్చునెడఁ తానెటువంటి బలాడ్యుడున్ నిజ

స్థానికుడైన యల్పుని కతంబుననైనను మోసపోవుగా

కానలలోపలన్ వెడలి గందగజం బొకనాఁడు నీటిలో

గానక చొచ్చినన్ మొసలికాటున లోఁబడ దోటు భాస్కరా!

అనువుగాని చోట అధికులమనరాదు అని వేమన శతకంలో ఓ మాట ఉంటుంది. అలాంటి అర్థాన్నే స్ఫురించే మరో పద్యం ఇది. ఏనుగు అనగానే బలిష్టమైన మదించిన జంతువే గుర్తుకువస్తుంది. అంతటి ఏనుగు కూడా నీటిలోకి ప్రవేశించగానే అందులో నివసించే మొసలికి లొంగిపోక తప్పదు. మనిషి కూడా తనది కాని స్థానంలోకి  ప్రవేశిస్తే, అక్కడ ఉండే అల్పుని చేతిలో పరాభవాన్ని పొందక త్పదు.


More Good Word Of The Day