సహజగుణాన్ని ఎవరు నిలువరించగలరు

 

 


అంభోజినీ వన విహార విలాసమేవ

హంసస్య హంతు నితరాం కుపితో విధాతా ।

న త్వస్య దుగ్ధ జల భేద విధౌ ప్రసిద్ధాం

వైదగ్య్ధ కీర్తిమపహర్తుమసౌ సమర్థః ॥

విధాత అయిన ఆ బ్రహ్మదేవునికి హంస మీద కోపం వచ్చిందే అనుకోండి. దానిని ఫలానా సరోవరంలో విహరించవద్దు అని నిషేధాన్ని విధించగలడు. కానీ పాలునీ, నీటినీ వేరుచేయగల దాని సహజగుణాన్ని ఆపలేడు కదా! మనిషి సహజగుణాలను నిలువరించడం అంత తేలికకాదని కవి ఉద్దేశం.


More Good Word Of The Day