ఎక్కడ ఉన్నా

 

 

సన్నుత కార్యదక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశ మై

యున్నపుడైన లోకులకు నొండొక మే లొనరించు సత్వసం

పన్నుఁడు భీముడాద్విజుల ప్రాణము కావడె ఏకచక్రమం

దెన్నికగా బకాసురుని నేపున రూపడగించి భాస్కరా!

కార్యదక్షత కలిగినవాడు ఏ ప్రాంతంలో ఉన్నా, అతనికి ఎలాంటి ప్రాభవం లేని సందర్భంలో ఉన్నా... తన అవసరం వచ్చినపప్పుడు వెనకడుగు వేయడు. పూర్వం వనవాసంలో ఉన్న భీముడు, ఏకచక్రపురంలోని ప్రజలను పీడిస్తున్న బకాసురుని సంహరించలేదా!

 

 

..Nirjara


More Good Word Of The Day