మహాలయ అమావాస్య... మహిమాన్విత అమావాస్య!

 

భాద్రపద అమావాస్య అంటే.. సెప్టెంబర్ 25న వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య క్రిష్ణ పక్షం చతుర్ధశి రోజున ప్రారంభమవుతోంది. తరువాతి రోజున కూడా కొనసాగుతోంది. ఈ పర్వదినాన శివుడిని పూజిస్తారు.ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల అన్ని సమస్యలు దూరమై జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తీ నమ్మకం, భక్తితో ఈ రెండు రోజులు శివుడిని పూజించాలి. అయితే శనిదేవుడిని కూడా ఈ అమావాస్య వేళ పూజిస్తే జీవితంలో ఎదుర్కొంటోన్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఏలా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  

శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారంనాడు వచ్చిదంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శనిదేవుడిని పూజించడం వల్ల చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించి, పవిత్ర స్నానాలు, యాగాలు చేసి, ఉపవాసం ఉండటం వల్ల కూడా పాపాల నుంచి విముక్తి పొందవచ్చు.

శివుడ్నే కాదు భాద్రపద అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.

చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ల కోసం ఉపవాసం ఆచరిస్తే వాళ్ల ఆత్మ శాంతిస్తుంది. అలాగే, శాస్త్రాల ప్రకారం పితృ దేవతలకు అమావాస్య ప్రత్యేకం. అందుకే అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరు మీద పూజలు నిర్వహించాలి. ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృ దేవతల్ని ఆరాధించాలి. శ్రద్ధగా శ్రాద్ధ క్రియ చేయటంతో పాటూ నువ్వుల నీటితో తర్పణాలు విడవాలి. అప్పుడే వాళ్లు సంతోషించి మనకు రక్షణ, శుభాలు కలిగిస్తారు...

ఈ అమావాస్య రోజు హోమం చేయడం కూడా చాలా మంచి పలితాలను ఇస్తుంది. జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రానుసారం మనకు ఏ హోమం అవసరమో తెలుసుకుని దాన్ని భాద్రపద అమాస్యనాడు ఆచరించాలి.

మొత్తంగా మహాలయ అమావాస్యగా చెప్పబడే ఈ భాద్రపద అమావాస్యనాడు ఎంత భక్తి, శ్రద్ధలతో గడిపితే అంత ఉత్తమం. ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ రోజు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది.


More Festivals